ఆమె ఎక్కితే ఓడ మునిగిపోతుంది.. కానీ ఈ అమ్మవారికి పీత బాతు మాంసమే నైవేద్యం..!

ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి శనివారం, మంగళవారం ఈ అమ్మవారికి పీత మాంసం, బాతు మాంసం( Crab meat, duck meat ) భక్తులు నైవేద్యంగా పెడతారు.జింగ్లేశ్వరి మాత కు ఈ మాంసాన్ని ఎందుకు నైవేద్యంగా పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం.

 If She Gets On Board, The Ship Will Sink But The Offering To This Mother Is Crab-TeluguStop.com

బెంగాల్ గ్రామీణ సాహిత్యంలో మనకు అనేక ప్రాంతీయ లేదా జానపద దేవతల గురించి తెలుసు.ఈ అమ్మవారి పేరు జింగళేశ్వరి.

సంవత్సరం పొడవునా కాళీని భక్తులు పూజిస్తారు.ప్రతిరోజు మాంసం ప్రసాదాన్ని జింగళేశ్వరి దేవికి సమర్పిస్తారు.

Telugu Bhakti, Crab, Devotional, Duck Meat, Board, Jingaleshwari, Shipmother-Lat

ఇతర కూరలు చేపలతో పాటు బాతు మాంసం, పీత మాంసం కూడా అందిస్తారు.దాదాపు 500 సంవత్సరాల క్రితం ఓడ స్తంభంపై జింగ్లేశ్వరి తల్లి దర్శనమిచ్చింది.భౌగోళికంగా ఈ సమయంలో ఈ ప్రాంతం నది కింద ఉండేది.పడవలు, ఓడలు తిరుగుతూ ఉండేవి.ఒకసారి ఒక స్త్రీ నది ఒడ్డున నిలబడి పడవ నడిపే వారిని హుంకా కావాలని కోరింది.అప్పుడు నావికులు ఆమెను ఓడ మీదకు రమ్మని అడిగారు.

అయితే ఆమె ఎక్కితే ఓడ మునిగిపోతుంది అని చెప్పింది.ఇది విన్న నావికులు నవ్వుకున్నారు.

Telugu Bhakti, Crab, Devotional, Duck Meat, Board, Jingaleshwari, Shipmother-Lat

ఆమెకు కోపం వచ్చి ఓడ ఎక్కింది.వెంటనే ఓడ నదిలో మునిగిపోయింది.నావికులు తమ తప్పును అర్థం చేసుకున్నారు.ఆ రోజు రాత్రి ఆమె తామ్రామ్లిప్త రాజు కలలో వచ్చి పూజ చేయమని ఆదేశించింది.అదేవిధంగా తామ్రామ్లిప్త ప్రావిన్స్ పూజలు ఏర్పాటు చేశాడు.అప్పటినుంచి రోజు పూజలు చేస్తున్నారు.

ఈ దేవాలయంలో వ్రతం చేసినప్పుడు జింగళేశ్వరి( Jingaleshwari ) మాత భక్తుల కోరికలు తీరుస్తుందని భక్తులు చెబుతున్నారు.ప్రస్తుతం ఈ దేవాలయం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది.

చేపల మాంసం, కూరలు, మిఠాయిలతో రోజు ఆహారం అందిస్తారు.అలాగే పీత మాంసం, బాతు మాంసం ఉంటాయి.

ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరూ జింగళేశ్వరినీ తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే పడవల, ఓడల యజమానులు పీతలను సమర్పించి మాతను పూజిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube