ఫిబ్రవరి 1 భీష్మ ఏకాదశి రోజు.. ఇలా చేస్తే ఐశ్వర్యం ఆరోగ్యం..

భారతంలో శాంతి పర్వం అనుశాసనిక పర్వం భీష్ముని మహా విజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు.అష్ట వాసుల్లో ఒకరిగా శౌర్య ప్రతాపంలో ఆసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు భీష్మచార్యుడు.

 February 1 Bhishma Ekadashi Day ,bhishma Ekadashi, Lord Vishnu,bhishmacharya,god-TeluguStop.com

భీష్మచార్యుడు తన తండ్రి కోసం రాజ్యాన్ని మాత్రమే కాకుండా తన సంసార సుఖాన్ని కూడా త్యాగం చేశాడు.తన తమ్ముళ్లు చనిపోయిన తర్వాత కూడా అతను భీషణమైన ప్రతిజ్ఞ చేయడానికి కారణమైన సత్యావతి దేవికి స్వయంగా ఆజ్ఞాపించిన ప్రతిజ్ఞ భంగం చేయడానికి అంగీకరించలేదు.

అయితే అందరిలా భీష్ముడు ఎక్కడ బాహాటంగా తన కృష్ణ భక్తిని ప్రకటించలేదు.కేవలం ఒకే ఒక సందర్భంలో అది యుద్ధ భూమిలో ఉండగా అతను నమ్మిన దైవమైన పరమాత్మే స్వయంగా తనను చంపుతానని చక్రం చేపట్టినప్పుడు అంతకంటే తనకు కావాల్సింది ఏముందంటూ పరమాత్మ కు సాగిలపడ్డాడు.

Telugu Bhakti, Devotional, Februarybhishma, Jaya Ekadashi, Lord Vishnu, Maghasud

రాజ్యపాలన చేయాల్సి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు.మాఘ శుద్ధ అష్టమి రోజు భీష్మచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది.భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మఘ శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశ, జయ ఏకాదశి అని కూడా అంటారు.

Telugu Bhakti, Devotional, Februarybhishma, Jaya Ekadashi, Lord Vishnu, Maghasud

హిందూ పంచాంగం ప్రకారం మాఘ మాసం శుక్లపక్షంలో ఏకాదశి తిధి 31 జనవరి 2023 మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల 34 నిమిషములకు మొదలై ఫిబ్రవరి 1వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3.39 నిమిషములకు ముగుస్తుంది.సూర్యోదయం తిధిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఫిబ్రవరి 1వ తేదీన జయ ఏకాదశి, భీష్మ ఏకాదశి జరుపుకుంటూ ఉంటారు.

జయ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి.శ్రీమహావిష్ణువును పూజించాలి.ఈరోజు విష్ణు సహస్రనామం చదువుకున్న, విన్న మంచిది.రోజంతా ఉపవాసం పాటించి సంధ్యా సమయంలో పండ్లు తిని ఫిబ్రవరి రెండవ తేదీన ద్వాదశి రోజు స్నానం చేసి దేవునికి నమస్కరించి ఉపవాస వ్రతాన్ని విరమించడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube