వినూత్న ప్రయోగం.. పాడైపోయిన టైర్లతో కాంక్రీట్ తయారీ!

కరోనా తరువాత అన్నింటిపైనా ధరలు మండిపోతున్నాయి.ఈ క్రమంలో సిమెంట్ రేట్స్ కూడా ఆకాశాన్నంటుతున్నాయి.

 An Innovative Experiment  Making Concrete With Damaged Tires , Old Tyres, Vehicl-TeluguStop.com

సామాన్యుడు ఇల్లు కట్టుకుందామంటే కట్టుకోలేని పరిస్థితి వుంది.ఈ క్రమంలో కొందరు ఔత్సాహికులు నూతన పద్ధతులు అనుసరిస్తున్నారు.

దాంట్లో భాగంగానే పాడైపోయిన టైర్లతో కాంక్రీట్ తయారీని చేస్తున్నారు.బేసిగ్గా కాంక్రీట్ తయారీకి నీరు, సిమెంట్, ఇసుక, కంకర అవసరమైనప్పటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాలు ఇసుకతో పాటు కొంత నీటి కొరత కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి.

ఈ నేపథ్యంలోనే కాంక్రీట్ ప్రత్యామాయ కోసం తాజాగా పాడైన టైర్లతో నాణ్యమైన కాంక్రీట్ ఉత్పత్తి చేయడంలో పరిశోధకులు విజయం సాధించారు.

ఈ కాంక్రీట్ మిక్చర్ అనేది టైర్ పార్టికల్స్‌తో నిండి ఉంటుంది.

ఇందులో భాగంగా పాడైన టైర్లను కొంత మేర రీసైకిల్ చేస్తున్నారు.కానీ ఎక్కువ మొత్తంలో వాటిని కాల్చడం వలన పర్యావరణానికి నష్టం జరుగుతోంది.

దీంతో పరిశోధకులు కాంక్రీట్ తయారీలో ఇసుక లేదా కంకరకు బదులు కొంతమేర గ్రౌండ్-అప్ టైర్స్‌ను వాడుతున్నారు.ఇది సాధారణ కాంక్రీట్ కంటే పటిష్టంగా ఉన్నప్పటికీ ఇందులోని సిమెంట్ రబ్బరు ముక్కలతో తగినంత బాండింగ్ ఏర్పరచుకోకపోవడంతో తర్వాత కాలంలో కాంక్రీట్‌లో లోపాలు తలెత్తుతున్నాయి.

Telugu Concegraut, Innovative, Prepared, Road, Ups, Vehicles-Latest News - Telug

ఈ సమస్యను అధిగమించడానికి ఆస్ట్రేలియన్ RMIT యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.కాంక్రీటును మొదట్లో కలిపినప్పుడు రబ్బరులోని రంధ్రాలు నీటితో నిండిపోతాయి.అయితే ఆ రంధ్రాల్లోని నీరు ఆవిరైపోయి కాంక్రీట్ సెట్ అయిన తర్వాత రబ్బరు/సిమెంట్ ఇంటర్‌ఫేస్‌లో శూన్యత ఏర్పడుతుంది.కాగా ఈ సమస్యను పరిష్కరించేందుకు తడి కాంక్రీట్‌తో టైర్ పార్టికల్స్ కలిపి, ఆపై ఆ కాంక్రీట్‌ను ప్రత్యేక ఉక్కు అచ్చుల్లో ఉంచారు.

ఈ అచ్చులు కాంక్రీట్‌పై ఒత్తిడి తెచ్చి వాటిలోని కణాలు, రంధ్రాలను కుదించడంతో గట్టిపడిన తర్వాత ప్రీలోడెడ్ టైర్ కణాలతో ఆ సిమెంట్ బాగా బంధించబడింది.ఈ విధంగా కాంక్రీట్‌ను బలోపేతం చేసే మార్గాలను పరిశీలిస్తున్న పరిశోధకులు.

తద్వారా నిర్మాణ ప్రాజెక్టుల్లో ఉపయోగించే విధంగా రూపొందించేందుకు కృషిచేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube