వైరల్: కోయ్ కోయ్ 'పాస్టర్' పాటలో అంత డెప్త్ వుందా?

కోయ్ కోయ్ ‘పాస్టర్’ తెలుసా? అయ్యో అదేం ప్రశ్న? సోషల్ మీడియాలో ఎక్కడచూసినా ‘కోయారే కోయారే కోయ్’ పాట( ‘Koyare Koyare Koi’ song ) గురించే చర్చ నడుస్తోంది అంటారా? అవును, మీరు విన్నది నిజమే.సోషల్ మీడియాలో చాలా కామెడీగా ఈ పాట పడుతూ స్టెప్పులేసుకుంటూ ఓ పాస్టర్ తెగ హల్ చల్ చేస్తున్నాడు.

 Viral Koi Koi Song 'pastor' Has That Much Depth, Paster, Songs, Meaning, Viral L-TeluguStop.com

ఆ పాట ఏ బాషో, పాస్టర్ ఎక్కడివారో తెలీదు… కానీ ఓ రకమైన రిదమ్ తో కూడిన సదరు పాట ఓ వర్గం ప్రజలను ఖుషీ చేస్తోంది.మరీ ముఖ్యంగా ఆ పాస్టర్ పాడే విధానం చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.

Telugu Paster, Koi Koi Depth, Latest-Latest News - Telugu

దీంతో 2024 ఎండిగ్ లో కోయ్ కోయ్ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి ఏ సోషల్ మీడియా మాధ్యామాల్లో కూడా ఈ కోయ్ కోయ్ సాంగ్ వైరల్ కావడం కొసమెరుపు.చిన్నారుల నుండి పెద్దవారివరకు ఈ పాటలను ఆసక్తిగా చూస్తున్నారు అంటే మీరు దానిగురించి తెలుసుకోవలసిందే.అవును, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోయ్ కోయ్ సాంగ్ పాడిన ఆ పాస్టర్ తెలంగాణకు చెందిన వ్యక్తి.అతడి పేరు “మీసాల గురప్ప.”( mesala gurappa ) ఖమ్మం జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలోని కుంట గ్రామానికి చెందినవారు.అతడు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వుండే కోయ జాతికి చెందినవాడు కాబట్టి ఆ రకంగా కోయ్ కోయ్ అంటూ పాట పడుతూ జనాలను అలరించాడు.

Telugu Paster, Koi Koi Depth, Latest-Latest News - Telugu

ఈ క్రమంలోనే గురప్ప తన జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను జనాలతో పంచుకున్నాడు.అవి నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ ఆసక్తికరంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు.మీసాల గురప్ప తండ్రిపేరు ఆంబోతు అంకన్న( Ambotu Ankanna ).అతడు పెద్ద క్షుద్ర మాంత్రికుడట.వందలమంది తాంత్రికులను కూడా తయారుచేసాడట.

గురప్ప పుట్టగానే తల్లి మరణించిందట.విషయం ఏమిటంటే? ఆమె తమ జాతి నమ్మే దేవున్ని కాకుండా మరో దేవున్ని ఆరాధిస్తోందని చెట్టుకు కట్టేసి మరీ కొట్టి చంపారట.ఈ విషయం కాస్త పెద్దయ్యాక తనకు తెలిసిందని, ఓ దేవుడి కోసం తల్లి ప్రాణాలు వదిలిందంటే ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకొని క్రిస్టియన్ గా మారి యేసు ప్రభువుని ఆరాధిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube