సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా( Guntur Karam movie ) కు సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు అనే టెన్షన్ కి ఫ్యాన్స్ గురి అవుతున్నారు.సంక్రాంతికి సినిమా ను విడుదల చేయాలనే పట్టుదలతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.
కచ్చితంగా సంక్రాంతికి రాబోతుంది అంటూ ఇప్పటికే ప్రకటించారు.ఈ నేపథ్యం లో ఇప్పటికే సినిమా షూటింగ్ ను ముగించాల్సి ఉంది.
కానీ షూటింగ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అంటూ నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది.

మరో వారం అంటూ కూడా యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ అన్నారు. కానీ తాజాగా నేడు షూటింగ్ పూర్తి అయ్యింది అంటూ ప్రకటించారు.దాంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.
వారం అంటూ చెప్పి ఇంతలో పూర్తి చేయడం వెనుక ఆంతర్యం ఏంటి.అసలు సినిమా ను బాగా పూర్తి చేశారా.
చివర్లో సినిమా ను ముగించాలనే ఉద్దేశ్యంతో చుట్టేశారా అంటూ కొందరు ఫ్యాన్స్ ఈ సమయంలో ప్రశ్నిస్తున్నారు.సినిమా షూటింగ్ ను ఇంత స్పీడ్ గా పూర్తి చేయడం చూస్తూ ఉంటే ఫ్యాన్స్ లో కొందరికి అనుమానం కలుగుతూ ఉందట.

అసలు సినిమా విషయంలో త్రివిక్రమ్( Trivikram Srinivas ) వ్యూహం ఏంటో తెలియడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.గుంటూరు కారం సినిమా షూటింగ్ ను కొన్ని నెలల ముందే ముగించాల్సి ఉన్నా కూడా ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తూ వచ్చారు.ఇప్పుడేమో సినిమా విడుదల సమీపిస్తున్న సమయంలో షూటింగ్ ను చుట్టేస్తున్నారు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.సంక్రాంతికి సినిమా విడుదల కన్ఫర్మ్.అయితే సినిమా ఎలా ఉంటుందో అనే టెన్షన్ మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ లో కనిపిస్తోందట.ఈ సినిమా లో మహేష్ కి జోడీగా శ్రీ లీల ( Sreeleela )నటించిన విషయం తెల్సిందే.