తంతే బూరల బుట్టలో పడ్డట్టు కొంత మందికి ఆలా అవకాశం కలిసి వస్తుంది.అలంటి కోవలోకే వస్తుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.
ఏమాత్రం వొళ్ళు దాచుకోకుండా సినిమాలు చేసే అలవాటు ఉన్న రకుల్ తెలుగు లో తన పని అయిపొతుందెమో అని భావించి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.కానీ అక్కడ అదృష్టం అయితే కలిసి రాలేదు తన కన్నా వెనకాల వెళ్లిన రష్మిక మందన్న చేతిలో చాల సినిమాలు ఉన్న రకుల్ ఒకానొక టైం లో డీలా పడింది.
మీడియా సైతం ఆమెను పట్టించుకోలేదు.వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ వంటి సినిమాలో తెలుగు లో మొదటి సినిమా నటించింది రకుల్.
ఈ సినిమాలో సందీప్ నటన కన్నా కూడా రకుల్ కె ఓట్లు ఎక్కువ పడ్డాయి.
దాంతో ఆమెకు తెలుగు లో వరస అవకాశాలు వచ్చాయి.
ఆ తర్వాత అనేక మంది స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది.టాప్ స్టార్స్ అందరి సరసన ఆమె నటించింది.
ఇక సినిమాలు నటించపోయిన సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అందాలు ఆరబోస్తూ యూత్ ని బాగానే ఆకట్టుకుంది;.ఈ మధ్య కాలం లో జనాలకు కాస్త బోర్ కొట్టిన టాలీవుడ్ లో చివరగా 2021 లో వైష్ణవ తేజ్ సినిమా అయినా కొండపోలం లో నటించింది.
ఆ తర్వాత మళ్లి తెలుగు లో ఎక్కడ నటించలేదు రకుల్.ఆ తర్వాత మాత్రం బాలీవుడ్ ఈ అమ్మడు బాగానే బిజీ అయ్యింది.
ప్రస్తుతం వరసపెట్టి ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటుంది.
మొదట్లో ఈమెను పట్టించుకోని బాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు బాగానే రకుల్ తో సింక్ అయినట్టుగా తెలుస్తుంది.ఆమెకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది అని అంతా అనుకుంటున్నారు.అయితే ఆమె నటించిన చివరి ఐదు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆమె చేతిలో ఇప్పుడు ఏకంగా ఐదు సినిమాలు ఉండటం విశేషం.
ఇండియా 2, అయలన్ వంటి ప్రాజెక్ట్ కి ప్రస్తుతం రకుల్ సైన్ చేసింది.మరి ఇన్ని ఫ్లాప్స్ ఉన్నప్పటికీ ఆమె చేతిలో సినిమాలు ఐదు సినిమాలు ఉండటం అంటే నిజంగా అదృష్టమే.
ఇక ఈ సినిమాల్లో రెండు లేదా మూడు సినిమాలు హిట్ అయినా ఆమెకు బాలీవుడ్ లో తిరుగు ఉండదు అని అంత అనుకుంటున్నారు.