మెనోపాజ్‌ దశలో ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏంటో తెలుసా?

ప్ర‌తి స్త్రీని క‌ల‌వ‌ర పాటుకు గురి చేసే వాటిలో మెనోపాజ్ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.రుతుక్రమం ఆగిపోవ‌డాన్నే మెనోపాజ్ అంటారు.

ఇదేదో ఉన్న‌ట్టు ఉండి జ‌రిగే ప్ర‌క్రియ కాదు.దాదాపు ప‌న్నెండు నెల‌లుగా నెల‌స‌రి రాకుండా ఉంటే అప్పుడు మెనోపాజ్ గా తేలుస్తారు.

ఈ మెనోపాజ్ ద‌శ ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచీ స్త్రీ ఎన్నో అనుభ‌వాల‌ను ఎదర్కొంటుంది.అలాగే నీరసం, అలసట, చికాకు, బరువు తగ్గడం, మతి మరుపు, ఆందోళన, హెయిర్ ఫాల్‌, చ‌ర్మం నిగారింపు కోల్పోవ‌డం, వేడి ఆవిర్లు, ఒత్తిడి, ఏకాగ్రత లోపించడం, ఎముక‌ల బ‌ల‌హీన‌త, నిద్ర‌లేమి ఇలా ఎన్నో స‌మ‌స్య‌ల‌నూ ఆ ద‌శ‌లో ఫేస్ చేయాల్సి ఉంటుంది.

అయితే వీట‌న్నిటినీ అదిగ‌మించి ఆరోగ్యంగా ఉండాల‌న్నా, ఉత్సాహ‌నంగా మారాల‌న్నా ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వాస్త‌వానికి మెనోపాజ్ ద‌శ‌లో ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల శరీరంలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది.దాంతో అనేక స‌మ‌స్యలు ఏర్ప‌డ‌తాయి.

అందుకే ఈ స‌మ‌యంలో త‌ర‌చూ వాట‌ర్ తీసుకుంటూ ఉండాలి.త‌ద్వారా శ‌రీరం హైడ్రేట‌డ్‌గా ఉంటుంది.

అలాగే చాలా మంది మెనోపాజ్ ద‌శ‌లో ఫుడ్‌ను నిర్ల‌క్ష్యం చేస్తుంటారు.కానీ, ఆ ద‌శ‌లో హెల్తీగా ఉండాలీ అంటే పౌష్టికాహ‌రం తీసుకోవాలి.ముఖ్యంగా ప‌ప్పు ధాన్యాలు, చేపలు, మాంసం, గుడ్లు, పాలు, పెరుగు, ఇత‌ర పాల ఉత్ప‌త్తులు, న‌ట్స్‌, బ్రౌన్ రైస్‌, తాజా పండ్లు, ఆకుకూర‌లు, ఓట్స్‌, మెల‌కెత్తిన విత్త‌నాలు వంటివి తీసుకుంటే శ‌రీరానికి పోష‌కాల‌న్నీ అందుతాయి.

మెనోపాజ్ ద‌శ‌లో రెగ్యుల‌ర్‌గా వ్యాయామం, యోగా వంటివి చేయాలి.త‌ద్వారా ఒత్తిడి, ఆందోళ‌న‌, చికాకు వంటి స‌మ‌స్య‌లు దూరంగా అవుతాయి.మ‌తి మ‌రుపు త‌గ్గి.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

బ్రెయిన్ షార్ప్‌గా ప‌ని చేస్తుంది.మ‌రియు బాడీ కూడా ఫిట్‌గా త‌యార‌వుతుంది.

Advertisement

ఇక షుగ‌ర్, షుగ‌ర్‌తో త‌యారు చేసిన స్వీట్స్‌, సాల్ట్‌, వైట్ బ్రెడ్, పాస్తా, పొటాటో చిప్స్‌, కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్‌, ఆయిలీ ఫుడ్స్‌, స్పైసీ ఫుడ్స్‌కు ఎంత దూరంగా ఉండే ఆ ద‌శ‌లో అంత మంచిది.మ‌రియు ఆల్క‌హాల్, స్మోకింగ్ వంటి అల‌వాట్లును మానుకుంటే.

మెనోపాజ్‌ దశలోనూ హెల్తీగా, ఉల్లాసంగా ఉండొచ్చు.

తాజా వార్తలు