టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్.గత ఏడాది విడుదలైన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు.అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీతో పాటుగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు మారు మోగిపోతోంది.
ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయంగా అవార్డులను కొల్లగొడుతూ దూసుకుపోతోంది.ఇప్పటికే ఈ సినిమాలోని నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా అందుకున్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా ఆస్కార్ ఒరిజినల్ సాంగ్స్ నామినేషన్స్ లో నాటు నాటు పాట లిస్ట్ అయిన విషయం కూడా మన దగ్గర తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా మరో అరుదైన అధికారులు కూడా సొంతం చేసుకుంది ఈ సినిమా.అందుకోసం అవతార్ 2 సినిమాను వెనక్కినెట్టి మరి మరో అవార్డుని సొంతం చేసుకుంది.ప్రపంచ ఖ్యాతిని గాంచిన దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 2 సినిమాను వెనక్కి నెట్టి మరి ఈ అవార్డును కైవసం చేసుకుంది.2022 సంవత్సరానికి గాను అత్యధిక ఫ్యాన్స్ ఓటింగ్ తో అగ్రస్థానం నిలిచింది ఆర్ఆర్ఆర్ సినిమా.
దాంతో ఈ ఏడాది గోల్డెన్ టమోటో అవార్డుకు ఎంపిక అయింది.హాలీవుడ్ సినిమాలు అయినా అవతార్ 2, టాప్ గన్,బ్యాట్ మెన్ వంటి సినిమాలను వెనక్కి నెట్టి ఈ ఘనతను సాధించింది.ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు చేరడంతో చిత్ర బృందంతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఇందులో జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ హీరోలుగా నటించగా ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.