వామ్మో : అక్కడ ఆరువేల మంది కరోనా పేషంట్లు జాడ లేదు.. ఎక్కడంటే..?

కరోనాను అంతం చేయడానికి దేశం మొత్తం కర్ఫ్యూలు, లాక్ డౌన్ లు విధిస్తున్నప్పటికీ చాలా మంది ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు.వ్యాక్సిన్ తీసుకోవడానికి కొంత మంది భయపడుతుంటే మరికొంత మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి వ్యాక్సిన్ వేసుకోవడానికి క్యూ లైన్లలో నిల్చుని పోటీపడుతున్నారు.

 Six Thousand Corona Patients Disappeared In Bangalore , Corona Patients, Missed,-TeluguStop.com

ఇటువంటి తరుణంలో కరోనా లక్షణాలు ఉన్నవారు హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు.మరికొంత మంది ఆస్పత్రిలో బెడ్లు దొరక్క విలవిల్లాడుతున్నారు.

ఇదిలా ఉంటే బెంగుళూరులో మాత్రం ఓ ఘటన కలకలం రేపుతోంది.కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు నిబంధనలు పాటించకుండా జనంలో తిరుగుతూ ఇతరులకు కూడా కరోనా వ్యాప్తిచెందేలా చేస్తున్నారు.

కర్నాటక రాజధాని బెంగళూరులో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు కొన్ని వేల మంది అదృశ్యమైనట్లు సమాచారం.బెంగళూరులో సుమారు ఆరు వేల మంది కరోనా పేషంట్లు కనిపించకుండా పోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

గతంలో కూడా పది వేల మంది వరకూ కనిపించకుండా పోయారు.ఇప్పటికీ వారి ఆచూకీ తెలియలేదు.ఇప్పుడు మళ్లీ ఆరు వేల మంది ఇలా అదృశ్యం కావడం ప్రభుత్వాధికారులు వారిని గాలించే పనిలో పడ్డారు.కరోనా పరీక్షలకు వచ్చినవారు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల వారి ఆచూకీ తెలియడం లేదు.

అంతే కాకుండా తమ సెల్‌ఫోన్‌లను స్విచ్ఛాఫ్‌ చేసి పెట్టుకోవడం వల్ల వారు ఎక్కడ ఉన్నారనేది అధికారులు గుర్తించలేకపోతున్నారు.ఇలా తప్పించుకుని తిరుగుతున్నవారిని వెతకడం పోలీసులకు తలకు మించిన భారంగా మారుతోంది.

సోమవారం నుంచి కర్నాటకలో సంపూర్ణ లాక్‌డౌన్ ఉండటం వల్ల చాలా మంది తమ ఊర్లకు వెళ్లిపోయారు.జిల్లా, రాష్ట్ర సరిహద్దులు మూతపడటంతో బెంగళూరులోని వలస కూలీలు తమ ఊర్లకు పయనమవడతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు కిటకిటలాడాయి.

ఇటువంటి నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాధికారులు కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube