ఈ రోజుల్లో స్టంట్స్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది.సోషల్ మీడియా ప్రభావమో లేదంటే ఇంకేదైనా కారణమేమో గానీ చిన్న పెద్ద ఆడ, మగ తేడా లేకుండా అందరూ విన్యాసాలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు ఈ క్రమంలో అనుకొని ప్రమాదాలు జరుగుతూ వారు తీవ్ర గాయాల పాలవుతున్నారు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో( Bulandshahr, Uttar Pradesh state ) సరిగ్గా ఇలాంటి ఓ ఘోర విషాదం చోటు చేసుకుంది.
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ప్రమాదకరమైన ట్రాక్టర్ స్టంట్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.తమ ట్రాక్టర్ల బలమెంతో చూసుకునేందుకు తాడుతో కట్టి లాగుతుండగా ఈ దారుణ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే, సూరజ్‌పూర్ ( Surajpur )గ్రామంలో తేజ్‌బీర్ అనే వ్యక్తి తన ట్రాక్టర్‌తో స్టంట్స్ చేస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది.పోటీలో భాగంగా ట్రాక్టర్ వెనక్కి లాగుతుండగా ఒక్కసారిగా అది కంట్రోల్ తప్పి బోల్తా పడింది.ఇంకేముంది, కళ్లముందే ఆ యువకుడు ట్రాక్టర్ కింద పడి నలిగిపోయాడు.రక్తం ఏరులై పారింది.తీవ్రంగా గాయపడిన తేజ్‌బీర్‌ను అక్కడున్న వారు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.ఈ ప్రమాదకర విన్యాసాన్ని తేజ్‌బీర్ కుటుంబ సభ్యులతో పాటు మరో డ్రైవర్ కుటుంబ సభ్యులు కూడా కళ్లారా చూశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియోలో రెండు ట్రాక్టర్లు పోటీ పడుతూ ఒక్కసారిగా ఒక ట్రాక్టర్ తిరగబడటం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ వీడియో వైరల్ కావడంతో బులంద్‌షహర్ పోలీసులు వెంటనే స్పందించారు.మరో ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు ( tractor driver )నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇంతటి ప్రమాదకరమైన పోటీ ఎలా జరిగింది? కుటుంబ సభ్యులు చూస్తుండగా ఈ విన్యాసానికి ఎలా అనుమతించారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.ఇలాంటి ప్రాణాలతో చెలగాటమాడే విన్యాసాలకు దూరంగా ఉండాలని, భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని ఈ విషాద ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.