కలలో కనిపించిన లాటరీ నంబర్‌ను నిజంగానే కొన్నాడు.. ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు!

సాధారణంగా మనకు వచ్చే కలలలో నిజమయ్యేవి చాలా తక్కువ.అయితే ఇలా నిజమయ్యేవి కొన్నే కానీ ఆ కలలే ఒక్కోసారి మనుషుల జీవితాన్ని మార్చేస్తాయి.

 Dream, Lottery, Viral Latest, News Viral, Social Media, Ticket-TeluguStop.com

కలల వల్ల కొందరు తమ భవిష్యత్తులో జాగ్రత్తపడి ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు.ఇంకొందరు తమ భవిష్యత్తు ప్లాన్స్ గురించి కలలు కంటుంటారు.

వాటిని నిజజీవితంలో కూడా చేసి సక్సెస్ అవుతారు.ఇవి నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా.

కలలు రావడం వల్లే తాము ఈ స్థాయికి వచ్చామని ప్రజలు అప్పుడప్పుడూ చెబుతుంటారు.అయితే తాజాగా ఒక వ్యక్తి కూడా ఇలానే చెబుతున్నాడు.

తనకు కలలో ఒక లాటరీ నంబర్ కనిపించిందని.ఉదయాన్నే లేవగానే అదే లాటరీ నంబర్ గల టికెట్‌ను తీసుకున్నానని.

దానికే లాటరీ తగిలిందని ఈ వ్యక్తి చెబుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు.

వివరాల్లోకి వెళితే… అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి చెందిన అలోంజో కోల్‌మ్యాన్ అనే ఒక వ్యక్తి లాటరీ ద్వారా ఏకంగా 2,50,000 (దాదాపు రూ.2 కోట్లు) డాలర్లు గెలుచుకున్నాడు.ఇతడికి లాటరీలు కొనడం అంటే చాలా ఇష్టం.

అయితే ఎప్పుడూ కూడా నిరాశ ఎదురయ్యేది.కాగా జూన్ 10వ తేదీన అతనికి ఒక కల వచ్చింది.

ఆ కలలో ఒక నంబర్ స్పష్టంగా కనిపించింది.ఆ నంబర్‌కి లాటరీ తగిలిందని కూడా కలలో కనిపించింది.

ఉదయాన్నే లేవగానే అతడు తనకొచ్చిన కలను గుర్తు చేసుకొని ఆశ్చర్యపోయాడు.అనంతరం తన కల నిజం అవుతుందా అబద్ధం అవుతుందా అనేది తెలుసుకునేందుకు అదే నంబర్ లాటరీ టికెట్ కొన్నాడు.

Telugu Dream, Lottery, Ticket, Latest-Latest News - Telugu

అయితే జూన్ 11న డ్రా చేపట్టగా… అందులో అలోంజో కొనుగోలు చేసిన టికెట్‌కే లాటరీ తగిలింది.దాంతో ఏకంగా 2,50,000 డాలర్లు అతడి సొంతమయ్యాయి.ఈ అదృష్టం చూసి అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.తనకి వచ్చిన ఒక కల తన జీవితాన్నే మార్చేసింది అంటూ అతడు స్థానిక మీడియాకి తెలిపారు.

ఇతడి లక్కు స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది.అదృష్టం అంటే ఇదే, కలలో వచ్చి మరీ ఇతడిని కోటీశ్వరుడిని చేసింది, ఇదొక మిరాకిల్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube