భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు చేరుకున్నారు.తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ఆమె ఏపీలోని శ్రీశైలానికి చేరుకున్నారు.
అక్కడ శ్రీశైల భ్రమరాంబిక స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.అనంతరం తిరిగి హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
కాగా విమానాశ్రయంలో ద్రౌపది ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసైతో పాటు సీఎం కేసీఆర్ ఘనంగా స్వాగతం పలికారు.కాగా రాత్రి 7.45 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ విందులో ముర్ము పాల్గొననున్నారు.అదేవిధంగా పర్యటనలో భాగంగా ఈనెల 30 వరకు పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొననున్నారు.
అయితే ముర్ము తొలిసారిగా తెలంగాణలో పర్యటిస్తున్నారు.