వీడే అసలైన జీనియస్.. పని చేయకుండానే కోట్లు సంపాదిస్తున్నాడు.. ఎలాగో తెలుసా?

ఇటీవల కాలంలో సంవత్సరానికి రూ.10 లక్షలు సంపాదించాలన్నా చాలా కష్టపడాల్సి వస్తోంది.బాగా చదువుకుని పెద్ద కంపెనీలో చేరితే అప్పుడు 20 లక్షలు పైగా సంపాదించడం సాధ్యమవుతుంది.ఆ ఉద్యోగాల్లో కూడా రోజూ గంటల తరబడి ఎంతో ఒత్తిడితో కూడిన వాతావరణంలో వర్క్ చేయాల్సి ఉంటుంది.అయితే ఒక జపాన్ వ్యక్తి మాత్రం ఏమీ చేయకుండానే ఏడాదికి రూ.69 లక్షలు సంపాదిస్తున్నాడు, ఇప్పటికే అతని కోటీశ్వరుడు అయ్యాడు, వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.ఇప్పుడు అతను సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు.ఆయన వయసు 41 ఏళ్లు, పేరు మోరిమోటో.

 Do You Know How Vide Is A Real Genius Earning Crores Without Working, Morimoto,-TeluguStop.com

ఆయన్ని “రెంట్ ఎ డూ-నథింగ్ గై” ( Rent a Do-Nothing Guy )అని పిలుస్తారు.అంటే, ఎవరైనా తమకు తోడు కావాలనుకుంటే, మోరిమోటోని డబ్బులిచ్చి పిలుచుకోవచ్చు.

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది రొమాంటిక్ వ్యవహారం కాదు.కేవలం తోడుగా ఉండటం వరకే ఆయన సర్వీస్ పరిమితం.

మోరిమోటో ( Morimoto )దగ్గరికి వచ్చే రిక్వెస్ట్‌లు చాలా వింతగా అనిపిస్తాయి కానీ వాటి వెనుక బలమైన కారణాలు ఉంటాయి.ఉదాహరణకు, కొందరు తమ గది శుభ్రం చేసుకుంటున్నప్పుడు వీడియో కాల్‌లో జాయిన్ అవ్వమని అడుగుతారు.

మరికొందరు మారథాన్( Marathon ) పూర్తి చేసుకునే చోట ఎదురుచూడమని చెబుతారు.ఒకసారి ఒక మహిళ తన భర్తకు విడాకుల విషయం చెప్పేటప్పుడు, తన కళ్లెదురుగా ఒక కేఫ్‌లో కూర్చోమని కోరింది.

ఇంకోసారి ఒక క్లయింట్ స్నేహితుడి బదులు ఒక కచేరీకి హాజరయ్యాడు.ఇలాంటి వింతైన పనులతో మోరిమోటో ఫుల్లుగా పాపులర్ అయ్యాడు.ఇప్పుడు ఆయనకు ఏడాదికి దాదాపు 1,000 రిక్వెస్ట్‌లు వస్తున్నాయి.

Telugu Companionship, Genius, Job, Japan, Morimoto, Romantic, Pay, Unusual-Telug

మొదట్లో ఆయన రెండు మూడు గంటలకు రూ.5,400 నుంచి రూ.16,200 వరకు ఛార్జ్ చేసేవాడు.అయితే, తర్వాత “పే యాజ్ యు విష్” ( Pay As You Wish )అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాడు.అంటే, క్లయింట్లు తమకు తోచినంత డబ్బులు ఇవ్వొచ్చు.

ఈ పద్ధతి వర్కౌట్ అవుతుందో లేదోననే ఉత్కంఠ తనకు చాలా ఇష్టమని మోరిమోటో చెబుతున్నాడు.ఎందుకంటే, ఆయన చేసే పని విచిత్రమైనది కదా.సాధారణంగా కలవడానికి ఇబ్బంది పడేవాళ్లు, ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడని వాళ్లు మోరిమోటో నిశ్శబ్దంగా తమ పక్కన ఉండటాన్ని చాలా సౌకర్యంగా భావిస్తారు.ఆశ్చర్యం ఏంటంటే, మోరిమోటో తన క్లయింట్లతో ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్లను అలరించాల్సిన పనిలేదు.

కేవలం అక్కడ ఉంటే చాలు.

Telugu Companionship, Genius, Job, Japan, Morimoto, Romantic, Pay, Unusual-Telug

చివరిగా మోరిమోటో తన పని గురించి మాట్లాడుతూ, తనకు ఈ ఉద్యోగం అంటే చాలా ఇష్టమని చెప్పాడు.క్లయింట్లను కలవడం, వాళ్ల కథలు వినడం, కొత్త ప్రదేశాలు చూడటం వంటివి తనకు చాలా సంతోషాన్ని ఇస్తాయన్నాడు.“నేను నిజంగా చేయాలనుకున్నది ఇదే,” అని ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.ఇది కదా అసలు విచిత్రం.“ఏం చేయకుండా డబ్బులు సంపాదించే ఈయనే కదా అసలైన జీనియస్ అంటే” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube