జుట్టు ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అనేక సమస్యలు చుట్టుముట్టేస్తాయి.జుట్టు అధికంగా ఊడిపోవడం, చుండ్రు, జుట్టు చిట్లడం, విరగడం, కురులు పొడిగా నిర్జీవంగా మారడం తదితర సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
వీటన్నిటికీ చెక్ పెట్టి జుట్టును హెల్తీ గా ఉంచడానికి ఇప్పుడు చెప్పబోయే హెయిర్ స్ప్రే అద్భుతంగా సహాయపడుతుంది.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ స్ప్రే కనుక వాడితే మీరు ఊహించని బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ స్ప్రే ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ముందుగా ఒక అలోవెరా ఆకు ని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.అలాగే అందులో కట్ చేసి పెట్టుకున్న అలోవెరా ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, వన్ టేబుల్ స్పూన్ కాలోంజి సీడ్స్, ఐదు లవంగాలు వేసుకొని ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ స్ప్రే రెడీ అవుతుంది.ఒక స్ప్రే బాటిల్ తీసుకుని తయారు చేసుకున్న మిశ్రమాన్ని నింపుకోవాలి.కుదుళ్ల నుంచి చివర్ల వరకు హెయిర్ స్ప్రేను ఒకటికి రెండుసార్లు పట్టించాలి.

రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ స్ప్రే వాడితే జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.చుండ్రు సమస్య ఉంటే దూరం అవుతుంది.తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.జుట్టు పెరగడం చిట్లడం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.హెయిర్ ఫాల్ సమస్య సైతం క్రమంగా కంట్రోల్ అవుతుంది.
కాబట్టి తప్పకుండా ఈ హెయిర్ స్ప్రే ను వాడేందుకు ప్రయత్నించండి.