బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.దుబ్బాక నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి ఫండ్ నిధులు కేటాయించలేదని ఆరోపిస్తూ ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే రఘునందన్ రావు పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.







