ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, అధికంగా మొబైల్ వినియోగిచడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం ఇలా రకరకాల కారణాల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటారు.ఈ నల్లటి వలయాలు ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.
అందుకే వీటిని వదిలించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.ఈ క్రమంలోనే మార్కెట్‌లో లభ్యమయ్యే రకరకాల క్రీములు, ఆయిల్స్, సీరమ్స్ యూజ్ చేస్తుంటారు.
అయితే ఇవేమి కాకుండా పండ్లతోనూ నల్లటి వలయాలకు బై బై చెప్పొచ్చు.మరి ఆ పండ్లేంటో.? వాటిని ఎలా యూజ్ చేయాలో.? ఇప్పుడు తెలుసుకుందాం.
అవకాడో ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చర్మానికి అంతే మేలు చేస్తుంది.ముఖ్యంగా కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలను తొలిగించడంలో అవకాడో పండు సూపర్‌గా సమాయపడుతుంది.
బాగా పండిన అవకాడో పండును మెత్తగా పేస్ట్ చేసుకుని అందులో కొద్దిగా బాదం ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టు అప్లై చేసి ముప్పై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.
అనంతరం కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తూ నల్లటి వలయాలు పరార్ అవుతాయి.
అలాగే పైనాపిల్ తోనూ నల్లటి వలయాలను వదిలించుకోవచ్చు.కొన్ని పైనాపిల్ ముక్కలను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.అపై పైనాపిల్ జ్యూస్‌ను కళ్ల చుట్టూ అప్లై చేసి రెండు నిమిషాల పాటు స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి.ఇలా రాత్రి నిద్రించే ముందు చేసి.ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.ఇలా రోజూ చేసినా మంచి ఫలితం ఉంటుంది.
స్ట్రాబెర్రీలు సైతం వలయాలను తగ్గించగలవు.మూడు, నాలుగు స్ట్రాబెర్రీ పండ్లను తీసుకుని మెత్తగా నూరి జ్యూస్ తీసుకోవాలి.
ఇప్పుడు రెండు స్పూన్ల స్ట్రాబెర్రీ జ్యూస్‌కు ఒక స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసుకుని.
ఇరవై నిమిషాల తర్వాత వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజూ ఉదయం, సాయంత్రం చేసినా నల్లటి వలయాలు క్రమంగా మటుమాయం అవుతాయి.