టాలీవుడ్ ప్రేక్షకులకు మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది తన అందం.
ఈమె అందానికి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ దూసుకుపోతోంది.
అందం విషయంలో మాత్రమే కాకుండా అవకాశాల విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు ఈ ముద్దుగుమ్మ.ఇప్పటికీ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
సౌత్ నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

అంతే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణించడంతోపాటుగా వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది తమన్నా.ఇకపోతే గత ఏడాది తమన్నా తెలుగు హిందీలో కలిపి ఏకంగా ఐదు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది.ఈ ఏడాది కూడా అదే జోరు చూపించనుంది.
ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది ఈ మిల్క్ బ్యూటీ.ఇది ఇలా ఉంటే తాజాగా తమన్నా తన నటిస్తున్న రెండు కేజీ ప్రాజెక్టు గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాజాగా హైదరాబాదు లోని అజా ఫ్యాషన్ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన తమన్నా మీడియాతో ముచ్చటించారు.

నేపథ్యంలోనే జైలర్, బోలా శంకర్, గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.స్టార్ హీరోలు అయినా సూపర్ స్టార్ రజినీకాంత్ చిరంజీవి సరసన నటిస్తుండడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నటిస్తుండడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపింది.
ఏ హీరోయిన్ కి అయినా రజిని సార్ తో కలిసి పని చేయడం డ్రీమ్ గా ఉంటుంది అని ఆమె తెలిపింది.తాను కూడా కొన్నేళ్లుగా అదే డ్రీమ్ లో ఉన్నట్టు చెప్పుకొచ్చింది.
అది ఇన్ని రోజులకు నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపింది తమన్నా.ఇకపోతే ఇప్పటికే మెగాస్టార్ సరసన సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు బోలా శంకర్ సినిమాతో మరోసారి నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.తమన్నా సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
అంతేకాకుండా సమయం దొరికినప్పుడల్లా వెకేషన్లు తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ బ్యూటీ.







