దిల్ రాజు ప్రొడ్యూసర్ గా సాయి కిరణ్ అడివి డైరెక్షన్ లో వచ్చిన కేరింత మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా కథ సాయి కిరణ్ గారిది అయినప్పటికీ ఈ సినిమా డైలాగ్స్ మాత్రం వేరే రైటర్ తో రాయించాలి అని డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనుకున్నారు.
అయితే దిల్ రాజు బ్యానర్ లో ఎప్పుడు ఏదో ఒక సినిమా కి వర్క్ చేస్తూనే ఉండే డైలాగ్ రైటర్ అబ్బూరి రవి ఈ సినిమాకి డైలాగ్స్ రాయడం జరిగింది.

ఈ సినిమా కి డైలాగ్స్ రాసే క్రమంలో అబ్బూరి రవి కి కొంచం వేరే పర్సనల్ పనులు ఉండటం తో కొన్ని సీన్స్ కి డైలాగ్స్ రాయడానికి తను అందుబాటులో లేడు దాంతో ఏం చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్టర్ సాయి కిరణ్ కి వెంకీ అట్లూరి మంచి ఫ్రెండ్ కావడం వల్ల అబ్బూరి రవి దగ్గర పర్మిషన్ తీసుకుని వెంకీ అట్లూరి తో ఈ సినిమా బ్యాలెన్స్ డైలాగ్స్ రయించారట ఈ సినిమా మంచి విజయం సాధించింది.వెంకీ అట్లూరి ఆ తర్వాత డైరెక్టర్ గా మారి వరుణ్ తేజ్ తో తొలిప్రేమ సినిమా తీసి హిట్ కొట్టి డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు.

అలా డైరెక్టర్ అవ్వడానికి ముందే రైటర్ గా సక్సెస్ అయి మంచి విజయాన్ని అందుకున్నాడు ఇప్పటి వరకు వెంకీ అట్లూరి చేసిన సినిమాలు తొలిప్రేమ,మిస్టర్ మజ్ను,రంగ్ దే లాంటి సినిమాలు చేశాడు ప్రస్తుతం ధనుష్ హీరోగా వస్తున్న సార్ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది.అది ఈ నెలలోనే రిలీజ్ కానుంది.








