బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కమల్ రషీద్ ఖాన్ (కేఆర్ కే) గురించి పరిచయం అవసరం లేదు.ఈయన తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు.
ఈయన తరచూ బాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించి ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.అయితే తాజాగా ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీల గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త రకం ట్రెండ్ నడుస్తుందంటూ మరోసారి వివాదాలకు తెర లేపారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం న్యూ ట్రెండ్ నడుస్తోంది.ఫస్ట్ ప్రెగ్నెన్సీ.తరువాత పెళ్లి అనే ట్రెండ్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో నడుస్తోందని ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ కొత్తజంట కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు అంటూ ఈయన కామెంట్లు చేశారు.దీంతో ఈ విషయం కాస్త బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
కొత్తగా పెళ్లి చేసుకున్న జంట అంటూ ఈయన సంబోధించడంతో అందరి దృష్టి కియారా సిద్ధార్థ్ మల్హోత్రా జంటపై అందరి ఆలోచనలు పడ్డాయి.

గతంలో అలియా భట్ సైతం పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన అనంతరం ఆమె వివాహం చేసుకున్నారు.ఇలా వివాహం జరిగిన ఏడు నెలలకే ఆలియా ఆడబిడ్డకు జన్మనిచ్చారు.దీంతో ఈయన కొత్తజంట కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యారని చెప్పడంతో అందరూ తాజాగా పెళ్లి చేసుకున్న జంట కియారా సిద్ధార్థ్ మల్హోత్రా జంట కావడంతో ఈమె కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందా అందుకే ఇలా పెళ్లి చేసుకున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి మరి కె.ఆర్.కె చేసినటువంటి కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియదు కానీ ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.







