జాజికాయ.దీని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.
నాన్ వెజ్, బిర్యానీ వంటి వంటకాలు జాజికాయను రుచి, చక్కని సువాసన కోసం విరివిరిగా వాడుతుంటారు.అయితే వంటలకు రుచి, వాసన అందించడమే కాదు జాజికాయలో బోలెడన్ని పోషకాలతో పాటు అపారమైన ఔషధ గుణాలు నిండి ఉంటాయి.
అందుకే ఆయుర్వేద వైద్యంలో జాజికాయను ఉపయోగిస్తుంటారు.మన ఆరోగ్యానికి కూడా జాజికాయ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
చిటికెడు జాజికాయ పొడితో ఎన్ని జబ్బులకు దూరంగా ఉండొచ్చో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
మరి ఇంకెందుకు లేటు జాజికాయ పొడి ఎలా తీసుకోవాలి.? అసలు అది అందించే ప్రయోజనాలు ఏంటీ.? అన్నది ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ ను తీసుకోవాలి.ఈ వాటర్ లో చిటికెడు జాజికాయ పొడిని కలిపి నేరుగా సేవించాలి.ఇలా జాజికాయను ప్రతి రోజూ ఉదయాన్నే తీసుకుంటే.బోలెడు హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం చేసుకోవచ్చు.

జాజికాయ పొడి కలిపిన వాటర్ ను సేవించడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు దూరం అవుతాయి.మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.మెదడు మునుపటి కంటే వేగంగా, చురుగ్గా పని చేస్తుంది.ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతాయి.జాజికాయ పొడి కలిపిన వాటర్ ను తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.

జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి ఉంటే దూరం అవుతాయి.జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అందువల్ల జాజికాయ పొడి కలిపిన వాటర్ ను రోజు సేవించడం క్యాన్సర్, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి, మధుమేహం వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
జాజికాయను తీసుకోవడం వల్ల లైంగిక సమస్యలు ఏమైనా ఉంటే క్రమంగా తగ్గు ముఖం పడుతాయి.మరియు స్త్రీ పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.ఇన్ని ప్రయోజనాలు అందించే జాజికాయను తప్పకుండా డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.