వైరల్: ఊసరవెల్లులు జిమ్ చేస్తున్నాయి... అవాక్కవ్వాల్సిందే!

సమాజంలో సోషల్ మీడియా హవా బాగా ప్రబలడంతో ఇక్కడ నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.ఇక స్మార్ట్ ఫోన్ ( Smart phone )వాడకం కూడా అనివార్యం కావడంతో ఇలాంటి వాటికి మంచి గిరాకీ ఏర్పడింది.ఇక స్మార్ట్ ఫోన్ ఉన్నవారికి ఆటోమేటిక్ గానే పలు సోషల్ మీడియా అకౌంట్లు ఉంటాయి.ఇంకేముంది… రోజూ ఇందులో చేరుకున్న కంటెంట్ వారికి కనులు విందు చేయడంతో ఇక్కడ నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.వాటిలో జంతువులు, పక్షులు తదితరాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా నెటిజన్లు ఇష్టపడుతూ ఉంటారు.అందుకే ఆయా వీడియోలు ఎక్కువగా వ్యూస్ సంపాదిస్తూ సత్తాచాటుతూ ఉంటాయి.

 Viral Chameleons Doing The Gym Should Be Amazing, Zim, Viral Video, Viral Latest-TeluguStop.com

మరీ ముఖ్యంగా మనుషులను అనుకరించే జీవులను చూసినప్పుడు మనిషి మరింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వాటిని తిలకిస్తూ ఉంటాడు.ఇలాంటి విచిత్ర ఘటనలకు ( strange events )సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.తాజాగా, ఈ రకానికి చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.ఊసరవెల్లులు గురించి అందరికీ తెలిసిందే.వీడియోని ఒక్కసారి చూస్తే… 2 ఊసరవెల్లులు జిమ్‌లోకి ప్రవేశించడం ఇక్కడ చూడవచ్చు.తరువాత అవి ఊరికే ఉండకుండా… జిమ్‌లోని పరికరాల వద్దకు వెళ్లిన ఊసరవెల్లులు.

వాటి ఎదురుగా ఆగి పుషప్స్ తీయడం స్టార్ట్ చేశాయి.ఒక దాని కంటే మరొకటి పోటాపోటాగా పుషప్స్ తీయడంతో జిమ్ చేస్తున్న జనాలు వాటిని చూస్తూ అలా ఉండిపోయారు.

ఇక తొండలు, ఊసరవెల్లులు ఇలా ప్రవర్తించడం సాధారణమైన విషయం అయినప్పటికీ అవి జిమ్‌లో ఇలా చేయడం వల్ల వ్యాయామం చేస్తున్నట్లుగా జనాలు ఫీల్ అవుతున్నారు.చూసేందుకు అచ్చం పుషప్స్ తీస్తున్నట్లుగా ఉండడంతో అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో దీనిపై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు.“మనుషులు జిమ్ చేయడానికి బద్ధకించడంతో ఊసరవెల్లులు ఇలా చేయండి అని చేసి చూపిస్తున్నాయి!” అని కొందరు కామెంట్ చేస్తే.“ఇవి మనిషి కంటే సిన్సియర్‌గా జిమ్ చేస్తున్నాయి.వావ్ సూపర్!” అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తుండడం ఇక్కడ గమనించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube