2025 సంవత్సరంలో అత్యంత భారీ అంచనాలతో విడుదలైన తొలి సినిమా గేమ్ ఛేంజర్( Game changer ) అనే సంగతి తెలిసిందే.జనవరి 10వ తేదీన రికార్డ్ స్థాయి స్క్రీన్లలో చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ విడుదలైంది.చరణ్ ఆచార్య తర్వాత నటించి విడుదలైన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద హిట్టైందా? బాక్సాఫీస్ వద్ద శంకర్ మ్యాజిక్ చేశారా? దిల్ రాజుకు ఈ సినిమా లాభాలను అందించిందా? అనే ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
కథ :
అభ్యుదయం పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న బొబ్బిలి సత్యమూర్తి ( Bobbili Satyamurthy )(శ్రీకాంత్) మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పాలించాలని పార్టీ నేతలకు సూచిస్తాడు.గతంలో చేసిన తప్పులు అతడిని వెంటాడుతూ ఉంటాయి.సత్యమూర్తి పెంపుడు కొడుకులలో ఒకరైన బొబ్బిలి మోపిదేవి (ఎస్జే సూర్య) సీఎం కావాలని కలలు కంటూ ఉంటాడు.మరోవైపు ప్రియురాలి కోరిక మేరకు ఐఏఎస్ లక్ష్యాన్ని నెరవేర్చుకున్న రామ్ నందన్ (రామ్ చరణ్) కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించగానే తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులేంటి ? మంత్రి మోపిదేవి రామ్ నందన్ ( Minister Mopidevi Ram Nandan )మధ్య గొడవకు కారణమేంటి? రామ్ నందన్ తల్లి పార్వతి (అంజలి) మానసిక సమస్యలతో బాధ పడటానికి కారణమెవరు? తండ్రి అప్పన్నను కుట్ర చేసి చంపిందెవరు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
గత కొన్నేళ్లుగా శంకర్ సినిమాలలో ఆయన మార్క్ మిస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే గేమ్ ఛేంజర్ శంకర్ కు పూర్వ వైభవం తెచ్చిపెట్టే సినిమా అవుతుంది.సినిమాలో శంకర్ మార్క్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి.
కథనాన్ని అన్ ప్రెడిక్టిబుల్ గా నడిపిన శంకర్ సినిమాను సక్సెస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు.ఫ్లాష్ బ్యాక్ ను వేగంగా పూర్తి చేసి బోర్ కొట్టించకుండా చేయడంలో శంకర్ సక్సెస్ అయ్యారు.
అయితే కథ మరి కొత్తది కాకపోవడం, రొటీన్ కమర్షియల్ ఫార్ములా టెంప్లేట్ ను ఫాలో కావడం ఈ సినిమాకు ఒకింత మైనస్ అయింది.చరణ్ ఎస్జే సూర్య మధ్య సన్నివేశాలను మరింత బాగా తెరకెక్కించే ఛాన్స్ ఉంది.
రామ్ చరణ్ అటు రామ్ నందన్ ఇటు అప్పన్న పాత్రలకు జీవం పోశారు.చరణ్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించింది ఎవరంటే అంజలి అని చెప్పవచ్చు.ఆమె నటనకు జాతీయ అవార్డ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.
కియారా అద్వానీ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదు.కొన్ని షాట్స్ లో ఆమె లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకోలేదు.నిర్మాత దిల్ రాజు ( Produced Dil Raju )ఈ సినిమా ఖర్చుకు సంబంధించి ఏ మాత్రం రాజీ పడలేదు.
అయితే మరీ చిన్న పాత్రల కోసం కూడా పేరున్న నటులను తీసుకొని బడ్జెట్ ను అనవసరంగా పెంచారని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సైడ్ సత్యం పాత్రలో సునీల్ కడుపుబ్బా నవ్వించారు.
జయరాం, సముద్రఖని, నవీన్ చంద్ర పాత్రల పరిధి మేర నటించారు.వెన్నెల కిషోర్ పాత్ర సినిమాకు మైనస్ అయిందే తప్ప ప్లస్ కాలేదు.
ముకుంద పాత్రలో రాజీవ్ కనకాల అదరగొట్టగా సత్యమూర్తి పాత్రకు శ్రీకాంత్ జీవం పోశారు.సంక్రాంతి కానుకగా విడుదలైన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
థమన్ ( Thaman )మ్యూజిక్, బీజీఎం తెరపై బాగున్నాయి.కొండ దేవర, రా మచ్చా మచ్చా, జరగండి సాంగ్స్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.
అప్పన్న పాత్రకు లోపం పెట్టి దర్శకుడు కథనాన్ని ఊహించని విధంగా నడిపించారు.మిగతా టెక్నికల్ విభాగాలు తమ వంతు న్యాయం చేశాయి.కొత్త తరహా కథాంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు గేమ్ ఛేంజర్ నచ్చకపోవచ్చు.
ప్లస్ పాయింట్లు :
రామ్ చరణ్ నటన, డ్యాన్స్ థమన్ బీజీఎం అంజలి, శ్రీకాంత్ యాక్టింగ్
మైనస్ పాయింట్లు :
కథలో మరీ కొత్తదనం లేకపోవడం స్క్రీన్ ప్లేలో కొన్ని లోపాలు లాజిక్ లేని కొన్ని సీన్స్
రేటింగ్ :
3.0/5.0