రోత పుట్టించిన మందుల చీటి రాతతో నకిలీ డాక్టర్ పట్టివేత!

ఇంతకంటే దారుణ సంఘటనలు ఇంకా ఉండవేమో? తినే ఆహారం కల్తీ, పీల్చే గాలి కాలుష్యం, చదువు వ్యాపారమయం.ఇంకా ఇవి చాలవన్నట్టు.

 Fake Doctor Pattiveta With The Prescription Of Rota's Medicines, Docters, Slip,-TeluguStop.com

వైద్యం కూడా నకిలీ అయితే ఇక మనిషి మనుగడ ఎలా సాధ్యం? బతకడానికి కష్టబడని కొందరు కేటుగాళ్లు నకిలీలుగా సమాజంలో చెలామణీ అవుతూ, సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.అభం శుభం తెలియని జనాలు వారి మోసాలకు బలవుతున్నారు.

బతకడానికి కష్టించి పనిచేయడం చేతకాని ఓ దుర్మార్గుడు ఎంబీబీఎస్‌ ( MBBS )పేరుతో డాక్టర్ అవతారం ఎత్తాడు.ఏకంగా ‘షైన్ స్టార్’ హాస్పిటల్ ( ‘Shine Star’ Hospital )లో డాక్టరుగా వుద్యోగం వెలగబెట్టాడు.

ఈ క్రమంలో జనాలను నిలువు దోపిడీ చేయడం మొదలు పెట్టాడు.పాపం పండడంతో ఈ ఫేక్ డాక్టర్ బాగోతం బయటపడింది.

Telugu Docters, Pattiveta Rotas, Pics, Slip, Latest-Latest News - Telugu

వివరాల్లోకి వెళితే… కామారెడ్డి ( Kamareddy )జిల్లాలో జరిగిన ఈ వ్యవహారం కలకలం రేపింది.అనుమానమొచ్చి షైన్‌ స్టార్‌ హాస్పిటల్‌లో తనిఖీలు చేయగా ఫేక్‌ డాక్టర్ మోసం బయటపడింది.మందమర్రి మండలం రామకృష్ణ పూర్‌కు చెందిన రవీందర్‌ ( Ravinder )బేసిగ్గా డిగ్రీనే చదవలేదు.కానీ ఫేక్‌ డాక్టర్‌ సర్టిఫికెట్‌తో( fake doctor’s certificate ) ఎంబీబీఎస్‌ పూర్తి చేసినట్టు కటింగ్‌ ఇస్తూ చాలామందిని మోసం చేసాడు.

ఈ క్రమంలో రవీందర్‌ అనే రియల్‌ డాక్టర్‌ సర్టిఫికెట్లను డూప్లికేటు చేయించాడు.అతని ఫోటో వున్న ప్లేసులో తన ఫోటో అతికించాడు.గాంధీ ఆస్పత్రిలో పనిచేసినట్టు కవర్‌ చేశాడు.హాస్పిటల్‌ యాజమాన్యాలను బురిడీ కొట్టించి గత మూడేళ్లుగా ఆదిలాబాద్‌, కామారెడ్డి జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో పనిచేశాడు.

Telugu Docters, Pattiveta Rotas, Pics, Slip, Latest-Latest News - Telugu

అయితే దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టు సాగింది.అయితే ఈ నకిలీ డాక్టర్ రాసిన ప్రిస్కిప్షన్‌ చూసి… సమ్‌ థింగ్‌ ఈజ్‌ రాంగ్‌ అని పసిగట్టిన ఓ వ్యక్తి.పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆ యవ్వారం వెలుగు చూసింది.ఇంకేముంది… కట్ చేస్తే, అతను పనిచేస్తున్న హాస్పిటల్‌కు వెళ్లి సర్టిఫికెట్లను పోలీసులు వెరిఫై చేయగా అసలు సంగతి వెలుగు చూసింది.ఎంబీబీఎస్‌ చదవకుండా డాక్టర్‌గా ఎలా మేనేజ్‌ చేశాడు అని ఆరా తీస్తే నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి.ఈ క్రమంలో ఫేక్ ఆధార్ కార్డు, మరికొన్ని ఫేక్‌ సర్టిఫికెట్స్ దొరికాయి.

అతని దగ్గరి నుంచి సెల్ ఫోన్, ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు.అంతేకాకుండా ఇలా జనాలను మోసం చేస్తున్నది ఇతనొక్కడేనా? ఇంకెవరైనా ఉన్నారా అనే విషయంలో కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube