సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ లాభదాయకమైన ఇండస్ట్రీ కాదు.ప్రతి సంవత్సరం విడుదలయ్యే సినిమాలలో కేవలం 20 సినిమాలు మాత్రమే హిట్ టాక్ ను సొంతం చేసుకుంటాయి.
అయితే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెరకెక్కించిన సినిమాలకు పైరసీ రూపంలో( piracy ) షాక్ తగులుతోంది.మూవీ ఇండస్ట్రీకి ఈ దరిద్రం వదలదా అంటూ కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఒకప్పుడు పైరసీ అంటే సీడీల ద్వారా పెద్ద సినిమాలను చూసేవారు.తర్వాత రోజుల్లో తక్కువ ఖర్చుతోనే ఇంటర్నెట్ లభించడంతో పైరసీ వెబ్ సైట్ల ద్వారా సినిమాలను చూసేవారు.
అయితే ఆ సినిమాల ప్రింట్లు మరీ క్వాలిటీగా ఉండేవి కావు.ఆ సినిమాలలో డిస్టర్బెన్స్ కూడా ఎక్కువగా ఉండేది కాబట్టి ఎక్కువమంది పైరసీ సినిమాలను చూసేవారు కాదు.
అయితే రిలీజ్ రోజే గేమ్ ఛేంజర్ ( A game changer )హెచ్డీ ప్రింట్ లీక్ కావడం హాట్ టాపిక్ అవుతోంది.
మూవీ ఇండస్ట్రీని ఈ దరిద్రం వదలదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో సినిమాలు తీయాలంటే నిర్మాతలు ఆలోచించే పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు.అలాంటి వెబ్ సైట్లపై చర్యలు తీసుకునేలా తెలుగు రాష్ట్రాల సినీ ప్రముఖులు అడుగులు వేయాల్సి ఉంది.
ప్రధానంగా రెండు మూడు వెబ్ సైట్లు సినిమాలను పైరసీ చూస్తుండగా ఆ వెబ్ సైట్ల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
పైరసీ సైట్లకు శాశ్వతంగా చెక్ పెట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు.ప్రస్తుతం పెద్ద సినిమా అంటే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు కీలకం అవుతున్నాయి.రిలీజ్ రోజునే హెచ్డీ ప్రింట్లు వస్తే భవిష్యత్తులో పెద్ద సినిమాలు సైతం థియేటర్లలో ఒక్క రోజుకు, ఒక్క ఆటకు పరిమితమయ్యే ప్రమాదం అయితే ఉందని చెప్పవచ్చు.