రామ్ చరణ్( Ram Charan ) నటించిన గేమ్ ఛేంజర్ మూవీ( game changer movie ) బెనిఫిట్ షోలు ప్రదర్శితమైన తర్వాత ప్రేక్షకుల నుంచి అబవ్ యావరేజ్ టాక్ వచ్చింది.కథలో కొత్తదనం లేకపోయినా సినిమా బాగుందని ఫ్యాన్స్ కు నచ్చేలా ఉందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా గురించి విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ అవుతోంది.గేమ్ ఛేంజర్ పై కావాలనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
సినిమాలో వాస్తవానికి మైనస్ పాయింట్ల కంటే ప్లస్ పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి.సోషల్ మీడియాలో మత్రం వాటిని హైలెట్ చేయకుండా మైనస్ పాయింట్లనే ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు.
పొలిటికల్ కారణాలతో, రామ్ చరణ్ పై ద్వేషంతో, ఇతర హీరోలపై అభిమానంతో గేమ్ ఛేంజర్ ఫ్లాప్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.వాస్తవానికి గేమ్ ఛేంజర్ మూవీ బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు.
గత పదేళ్లలో శంకర్ డైరెక్షన్ ( Directed Shankar )లో వచ్చిన సినిమాలను పరిశీలిస్తే ఈ సినిమా ఎంతో బెటర్ అని చెప్పవచ్చు.గేమ్ ఛేంజర్ సినిమా 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది.250 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే హిట్ అనిపించుకుంటుంది.ఫ్యామిలీతో కలిసి చూడటానికి గేమ్ ఛేంజర్ లో ఎలాంటి అభ్యంతరకర సీన్లు లేవు.
మితిమీరిన హింస కూడా లేదు.
గేమ్ ఛేంజర్ పై కక్షతో నెగిటివ్ ప్రచారం చేస్తే భవిష్యత్తులో ఇతర హీరోల సినిమాల విషయంలో చరణ్ ఫ్యాన్స్ సైతం ఇదే విధంగా వ్యవహరించే ఛాన్స్ ఉంది.ఈ పరిస్థితి ఇండస్ట్రీకి మంచిది కాదు.ప్రతి సినిమా బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, ఆర్.ఆర్.ఆర్ రేంజ్ లో ఉండవనే విషయాన్ని సైతం గుర్తుంచుకోవాలి.రామ్ చరణ్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సినిమాలలో గేమ్ ఛేంజర్ ఒకటని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.