మొటిమల నివారణకు నిమ్మకాయను ఇలా ఉపయోగించండి  

How Lemon Juice Helps Pimples – Acne -

నిమ్మరసంతో తేనే,పెరుగు,రోజ్ వాటర్,గుడ్డు తెల్ల సోన ,నీరు మొదలైన పదార్దాలను కలిపి సులభమైన మరియు ప్రభావవంతమైన ఇంటి నివారణలను తయారుచేయవచ్చు.ఇప్పుడు ఆ ఇంటి నివారణల గురించి వివరంగా తెలుసుకుందాం.

1.నిమ్మరసం రాయటం
నిమ్మరసంను డైరెక్ట్ గా ముఖం మీద రాస్తే మొటిమలకు కారణం అయిన దుమ్ము,ధూళి, మలినాలు చర్మ రంద్రాల ద్వారా బయటకు పోతాయి.

TeluguStop.com - How Lemon Juice Helps Pimples – Acne-Telugu Stop Exclusive Top Stories-Telugu Tollywood Photo Image

ఇది మొటిమల నివారణకు అత్యంత సులభమైన మరియు సమర్థవంతమైన ఇంటి చికిత్సగా చెప్పవచ్చు.

కావలసినవి

నిమ్మకాయ – 1
నీరు – అవసరమైతే
కాటన్ బాల్ – 1
తేలికపాటి సబ్బు
ఒక చిన్న గిన్నె

పద్దతి

1.

తేలికపాటి సబ్బుతో ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత పొడి టవల్ తో శుభ్రంగా తుడుచుకోవాలి.
2.

నిమ్మకాయను రెండు బాగాలుగా కోసి రసాన్ని ఒక గిన్నెలోకి తీయాలి.
3.

ఈ నిమ్మరసంలో కాటన్ బాల్ ముంచి మొటిమలు ఉన్న ప్రాంతంలో రాయాలి.
4.

పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.
5.

ఈ విధంగా ప్రతి రోజు రెండు సార్లు చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.

గమనిక:

నిమ్మరసంను డైరెక్ట్ గా చర్మానికి రాసినప్పుడు ఏమైనా చికాకులు ఉంటే మాత్రం వెంటనే ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.అలాగే నిమ్మరసం రాసుకున్నాక ఎండలోకి వెళ్ళకూడదు.ఎందుకంటే అతినీలలోహిత కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి.

2.నిమ్మరసం మరియు రోజ్ వాటర్
రోజ్ వాటర్ ఆస్ట్రిజెంట్ లక్షణాలను కలిగి ఉండుట వలన చర్మంలో అధికంగా ఉన్న నూనెను తొలగించి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.ఇది చర్మానికి ప్రక్షాళన ప్రభావాన్ని కలిగిస్తుంది.దీనిలో ఉండే శోథ నిరోధక లక్షణాలు చర్మం యొక్క ఎరుపుదనాన్ని తగ్గిస్తాయి.హైడ్రేట్ లక్షణాలు కూడా ఉండుట వలన చర్మ గాయాలను నయం చేయడం మరియు మోటిమల కారణంగా సంభవించిన చర్మ చికాకును తగ్గిస్తుంది.

కావలసినవి

నిమ్మకాయ రసం – 1 స్పూన్
రోజ్ వాటర్ – 1 స్పూన్
నీరు – అవసరమైతే
కాటన్ బాల్ – 1
తేలికపాటి సబ్బు
ఒక చిన్న గిన్నె

పద్దతి

1.

తేలికపాటి సబ్బుతో ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత పొడి టవల్ తో శుభ్రంగా తుడుచుకోవాలి.
2.

ఒక గిన్నెలో నిమ్మరసం, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి.
3.

ఈ మిశ్రంమలో కాటన్ బాల్ ముంచి మొటిమల ప్రభావిత ప్రాంతంలో రాయాలి.
4.

పది నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
5.

ఈ విధంగా ప్రతి రోజు రెండు సార్లు చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు