ఇంత కాలం ఉత్తరాది రాష్ట్రాలకి పరిమితం అయిన బీజేపీ తన ద్రుష్టిని ఇప్పుడు దక్షిణాదిపై కూడా పెట్టింది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో బలమైన పట్టు సాధిస్తే భవిష్యత్తులో కేంద్రంలో తమకి ఎదురు ఉండదని భావిస్తుంది.
ఇందులో భాగంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదు మొదలుపెట్టగా, తెలుగు రాష్ట్రాలలో మరింత విస్తృతంగా సభ్యత్వాలు నమోదు చేయించాలని భావిస్తుంది.ఇప్పటికే ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ తో టీడీపీ నేతలని తనవైపు లాక్కుంటున్న బీజేపీ పార్టీ పెద్దలు ఇప్పుడు ఏపీలో ఎలా అయినా పాగా వేయాగాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా విజయవాడ వచ్చిన బీజేపీ నేత మాజీ సిఏం శివరాజ్ సింగ్ చౌహాన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆసక్తికర వాఖ్యలు చేశారు.
ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయిపొయింది అని, ఇప్పుడు టీడీపీ పరిస్థితి కూడా అలాగే ఉందని అన్నారు.
చంద్రబాబు ఏపీ అభివృద్ధిని పక్కన పెట్టి దేశ రాజకీయాలలో చక్రం తిప్పి బీజేపీని దెబ్బ తీయాలనే ప్రయత్నం చేస్తే ఇప్పుడు అతనికే గట్టి దెబ్బ తగిలిందని విమర్శించారు.ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని కేంద్రం ఇచ్చిన డబ్బులని పక్కదోవ పట్టించిన బాబు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ మీద తన లోపాలు నెట్టేసి లబ్ది పొందాలని ప్రయత్నం చేసిన ప్రజలు మాత్రం నమ్మలేదని అన్నారు.
ఇక ఏపీలో బీజేపీ పుంజుకుంటుంది అని భవిష్యత్తులో ఇక్కడ ప్రధాన పార్టీగా మారబోతుంది అని చెప్పుకొచ్చారు.ఏపీలో 25 లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు.







