ఈ జెనరేషన్ యువత బుర్రాలలో ఎప్పుడు కొత్త ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి.క్రియేటివిటీకి పదును పెట్టి కొత్త పంథాలో అవకాశాలు సృష్టించుకొని డబ్బు సంపాదించడంలో నేటి తరం చాలా ముందు వరుసలో ఉన్నారు.
సంప్రదాయాలని అవకాశంగా వాడుకొని కొత్త కొత్త ఆలోచనలకి శ్రీకారం చుట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు.ఇప్పుడు బెంగుళూరుకి చెందిన ప్రశాంత్ పూజారి అనే వ్యక్తి కూడా ఒక కాకిని పెంచుకొని ఇప్పుడు రెండు చేతులా సంపాదిస్తున్నాడు.
హిందూ సంప్రదాయాలలో పిండ ప్రధానం చేయడం ఆనవాయితీగా వస్తుంది.అయితే ప్రకృతి కాలుష్యం వలన కాకుల సంఖ్య చాలా వరకు అంతరించిపోయింది.పిండాన్ని కాకులు తింటే పితృ దేవతలు సంతృప్తి చెందుతారని హిందువుల విశ్వాసం.అయితే ఇప్పుడు వాతారణ కాలుష్యం వలన సిటీలలో కాకి అనేది కనిపించడం లేదు.
దీంతో కాకిని పెంచుకుంటున్న ప్రశాంత్ పూజారికి ఇప్పుడు డిమాండ్ భాగా పెరిగింది.పిండాలు తినడానికి కాకిని తీసుకెళ్తూ ఈ యువకుడు రోజుకి రెండు వేల వరకు సంపాదిస్తున్నాడు.
కరావళి ప్రాంతంలోని ప్రశాంత్ పూజారి అనే యువకుడిలో కొత్త ఆలోచనతో ఓ కాకిని పెంచుకోవడం ప్రారంభించి, ఎక్కడైనా సమారాధనలు జరిగితే కాకి దొరుకుతుందని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు.ఇక ఆ పోస్ట్ కి చాలా మంది రియాక్ట్ అయ్యి కాకిని బుక్ చేసుకోవడం మొదలుపెట్టారు.
అప్పటి నుంచి ఇంతనికి ఫుల్ డిమాండ్ ఏర్పడి, రెండు చేతులా సంపాదిస్తున్నాడు.