ఇండియాకి టాప్ క్లాస్ బౌలర్, అది కూడా విభిన్నమైన బౌలింగ్ శైలితో ఆకట్టుకునే బౌలర్ దొరికాడు.అతనే జస్ప్రీత్ బుమ్రా.
తన చిత్రమైన బౌలింగ్ శైలితోనే అందరి దృష్టిని ఆకర్షించిన బుమ్రా తక్కువ టైంలో తనదైన ముద్ర వేసి టీం ఇండియాలో నెంబర్ వన్ బౌలర్ గా మారిపోయాడు.అతడి శైలి విభిన్నంగా ఉన్నా కూడా, దానితోనే బుమ్రా అద్భుతాలు చేశాడు.
అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటి భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకుంటున్నాడు ఇటీవలి ప్రపంచకప్ లోనూ బుమ్రా అద్భుతంగా రాణించాడు.ఇప్పుడు బుమ్రా బౌలింగ్ శైలిని కుర్రాళ్లు అనుకరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తాజాగా మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఆసక్తి పెంచుతుంది.70 ఏళ్ల బామ్మ ఒకరు బుమ్రాలా బౌలింగ్ చేసే ప్రయత్నం చేయడం విశేషం.టీవీలో బుమ్రా బౌలింగ్ ను చూస్తూ తమిళనాడుకు చెందిన బామ్మ ఒకరు అతడిని అనుకరించే ప్రయత్నం చేసింది.చిన్న సైజు ఫుట్ బాల్ పెట్టుకుని ఆమె బుమ్రా స్టయిల్లో చేతుల్ని ముందుకు పెట్టి పరుగెత్తుతూ వెళ్ళడం ఆసక్తిగా మారింది.
ఈ వీడియోను శాంత సక్కుబాయి అనే అమ్మాయి ట్విట్టర్లో షేర్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యి బుమ్రా వరకు వెళ్ళగా అతను కూడా బామ్మ వీడియోకి ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.