టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) వయస్సు 64 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.అయితే బాలయ్య వయస్సు ఎక్కువే అయినా అయన రియల్ లైఫ్ లో తన వయస్సు 16 ఏళ్లు అని సరదాగా చెబుతూ ఉంటారు.
బాలయ్యకు కోపం ఎక్కువని చాలామంది ఫీలవుతారు కానీ బాలయ్యను దగ్గరినుంచి చూసిన వాళ్లెవరూ ఈ విషయాన్ని అంగీకరించారు.మరికొన్ని గంటల్లో బాలయ్య నటించిన డాకు మహారాజ్ మూవీ థియేటర్లలో విడుదలవుతోంది.
ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ వేదా అగర్వాల్( Child artist Veda Agarwal ) కీలక పాత్రలో నటిస్తున్నారు.కథను మలుపు తిప్పే పాత్రలో ఈ చిన్నారి కనిపించనున్నారని సమాచారం అందుతోంది.
అయితే మూవీ షూటింగ్ సమయంలో బాలయ్య ఆప్యాయత చూసి దగ్గరైన వేదా అగర్వాల్ అనే చిన్నారి షూట్ పూర్తైన తర్వాత బాలయ్యను మళ్లీ కలవడం సులువు కాదని తెలిసి ఒకింత ఎమోషనల్ అయ్యారని సమాచారం అందుతోంది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.వరుసగా మూడు హిట్లను సొంతం సొంతం చేసుకున్న బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో( movie Daku Maharaj ) డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుడతారేమో చూడాల్సి ఉంది.డాకు మహారాజ్ మూవీ 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కింది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
డాకు మహారాజ్ సినిమాకు క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.డాకు మహారాజ్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఒకింత భారీ స్థాయిలో జరిగింది.దర్శకుడు బాబీ ఈ సినిమాతో వాల్తేరు వీరయ్య సినిమాను మించిన హిట్ అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
గేమ్ ఛేంజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి డాకు మహారాజ్ పై ఉంది.