సీఎం రేవంత్ ఆదేశించారు... తెలంగాణ వచ్చేయమంటున్న హీరో నాగార్జున ?

ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ( Revanth Reddy ) సినీ పెద్దలు భేటీ అయిన విషయం మనకు తెలిసిందే.సినిమా టికెట్ల రేట్లను పెంచాలని బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలి అంటూ సినిమా పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాల గురించి మాట్లాడారు.

 Nagarjuna Promoting Telangana Tourisam Special Video Goes Viral, Telangana Touri-TeluguStop.com

ఇక ఈ భేటీలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని తెలియజేయడమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ అభివృద్ధి కోసం, డ్రగ్స్ నిర్మూలన, తెలంగాణ టూరిజం అభివృద్ధి కోసం సపోర్ట్ చేయాలని తెలిపారు.

ఇలా ప్రతి ఒక్క సినిమా విడుదలకు ముందు తప్పనిసరిగా డ్రగ్స్ గురించి అవగాహన కల్పిస్తూ వీడియోలు చేయాలని తెలిపారు .ఇలా రేవంత్ రెడ్డి చెప్పడంతో వెంటనే ప్రభాస్( Prabhas ) ఎన్టీఆర్  ( NTR ) వంటి  హీరోలు డ్రగ్స్ గురించి అందరిలో అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ కి దూరంగా ఉండాలని ఎవరైనా మీకు తెలిసి డ్రగ్స్ వాడుతుంటే అధికారులకు సమాచారం ఇవ్వాలి అంటూ అందరికీ అవగాహన కల్పించారు.

Telugu Nagarjuna, Revanth Reddy, Tollywood-Movie

ఇకపోతే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడమే ఆలస్యం అన్నట్టుగా తెలంగాణ టూరిజం ( Tourisam ) గురించి నాగార్జున ( Nagarjuna ) ఒక వీడియో విడుదల చేశారు.నేను చిన్నప్పటి నుంచి తెలంగాణ మొత్తం తిరిగేసాను .తెలంగాణలో ఎన్నో అద్భుతమైన బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి.జొదెగాట్ వ్యాలీ, మిట్టె వాటర్ ఫాల్స్, బొగత వాటర్ ఫాల్స్, వరంగల్ 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప టెంపుల్ ఉన్నాయి.రామప్ప టెంపుల్ వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్ ప్రతి ఒక్కరు చూడాలి.

Telugu Nagarjuna, Revanth Reddy, Tollywood-Movie

యాదగిరిగుట్ట అక్కడికి వెళ్తే దైవభక్తి అనుభూతి కలుగుతుంది.ఇక తెలంగాణ భోజనం విషయానికి వస్తే జొన్న రొట్టె అంకాపూర్ చికెన్, సర్వపిండి అంటే నాకు చాలా ఇష్టం అని తెలిపారు ఇరానీ చాయ్, కరాచీ బిస్కెట్స్, హైదరాబాద్ బిర్యానీ అయితే వరల్డ్ ఫేమస్, ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోలేనని వీటి గురించి చెబుతుంటే నోరూరిపోతుందని తెలిపారు.తెలంగాణ ప్రజలు చాలా మంచోళ్ళు అందరూ తెలంగాణకు వచ్చేయండి అంటూ టూరిజం గురించి నాగార్జున చెబుతూ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube