కెనడా ప్రధాని రేసులో భారత సంతతి ఎంపీ.. అనితకు గట్టిపోటీ తప్పదా?

ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో ( Justin Trudeau )రాజీనామా చేయడంతో కెనడాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.ఆయన రాజీనామాతో తదుపరి లిబరల్ పార్టీ నేత, ప్రధానిగా ఎవరు కానున్నారనే చర్చ మొదలైంది.

 Indian Origin Canadian Mp Chandra Arya Announces Run To Be Next Pm Of Canada ,-TeluguStop.com

ఇందులో పలువురు భారత సంతతి నేతలు కూడా ఉన్నారు.తాజాగా ఇండో కెనడియన్ నేత చంద్ర ఆర్య కీలక ప్రకటన చేశారు.

కెనడా ప్రధాని రేసులో నిలిచినట్లు ఆయన తెలిపారు.కెనడాను సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా మార్చడం, పదవీ విరమణ వయస్సును పెంచడం, పౌరసత్వ ఆధారిత పన్ను వ్యవస్ధను ప్రవేశపెట్టడం , పాలస్తీనాను గుర్తించడం వంటి వాగ్థానాలను ఆయన ఈ ఎన్నికల్లో ఇచ్చారు.

ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు.

కెనడాను సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా మార్చాలని కోరుకుంటున్నానని.

రాచరికాన్ని అంతం చేయాలని అనుకుంటున్నట్లు చంద్ర ఆర్య తెలిపారు.కోటాలపై కాకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేసిన మంత్రివర్గంతో సమర్థవంతమైన ప్రభుత్వాన్ని నడిపించాలని ఆయన ఆకాంక్షించారు.2040 నాటికి పదవీ విరమణ వయసును రెండేళ్లు పెంచాలని అనుకుంటున్నట్లు చంద్ర ఆర్య వెల్లడించారు.

Telugu Canada, Dharwad, Indianorigin, Justin Trudeau, Karnataka, Mp Chandra Arya

మనదేశాన్ని పునర్నిర్మించడానికి, భవిష్యత్ తరాలకు శ్రేయస్సును అందించడానికి కెనడా తదుపరి ప్రధానమంత్రిగా తాను పోటీ చేస్తానని చంద్ర చెప్పారు.కర్ణాటకలోని సిరలో( Sira, Karnataka ) జన్మించిన ఆయన ధార్వాడ్‌లోని కౌశాలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ( Kausali Institute of Management Studies, Dharwad )ఎంబీఏ పూర్తి చేశారు.2006లో ఆయన కెనడాకు వలస వెళ్లారు.తొలుత ఇండో కెనడా ఒట్టావా బిజినెస్ ఛాంబర్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించిన చంద్ర ఆర్య అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

Telugu Canada, Dharwad, Indianorigin, Justin Trudeau, Karnataka, Mp Chandra Arya

2015 కెనడా ఫెడరల్ ఎన్నికల్లో నెపియన్ నుంచి హౌస్ ఆఫ్ కామన్స్‌కు( Nepean to the House of Commons ) ఎన్నికయ్యారు.తొలి నుంచి కెనడాలో ఖలిస్తానీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా బలమైన స్వరం వినిపిస్తున్నారు చంద్ర ఆర్య.ఈ క్రమంలో ఆయన పలుమార్లు ఖలిస్తాన్ మద్ధతుదారులకు టార్గెట్ అయ్యారు కూడా.

ఇప్పటికే భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ కూడా కెనడా ప్రధాని రేసులో ఉన్న సంగతి తెలిసిందే.ఇప్పుడు చంద్ర ఆర్య కూడా పోటీలో నిలవడంతో ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube