సౌత్ ఇండియాలో నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో శివ కార్తికేయన్( Shiva Karthikeyan ) ఒకరు.గతేడాది అమరన్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న శివ కార్తికేయన్ ఆ సినిమా ద్వారా వార్తల్లో నిలిచారు.
ముకుంద్ వరదరాజన్ లైఫ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ప్రస్తుతం వరుస సినిమాలతో వెంకట్ ప్రభు( Venkat Prabhu ) కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.
బ్యాగ్రౌండ్ లేకున్నా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి శివ కార్తికేయన్ సక్సెస్ సాధించారు.శివ కార్తికేయన్ సక్సెస్ స్టోరీ ఎంతోమందిలో స్పూర్తి నింపుతుందని చెప్పవచ్చు. సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలనే విషయంలో భార్య నుంచి ప్రోత్సాహం లభించిందని శివ కార్తికేయన్ తెలిపారు.ఇక్కడికి వచ్చే సమయంలో మీ దగ్గర ఏమీ లేదని అయినా సరే మీరు ఇంత దూరం వచ్చారని గత 20 ఏళ్లలో విక్రమ్, అజిత్ ( Vikram, Ajith )మినహా ఇండస్ట్రీలో ఎవరూ ఎదగలేదని భార్య నాతో చెప్పిందని శివ కార్తికేయన్ అన్నారు.
ఇది అంత తేలికైన పనిగా తీసిపారేయవద్దని మీ స్టార్ డమ్ ప్రయోజనాలను మేము అనుభవిస్తున్నామని కాబట్టి కొన్ని ప్రతికూల అంశాలను సైతం ఎదుర్కోగలమని భార్య చెప్పిందని శివ కార్తికేయన్ పేర్కొన్నారు.యాక్టింగ్ వదిలేయాలనుకుంటే భార్య మాటలే నిలబెట్టాయని ఆయన వెల్లడించారు.సామాన్యుడు సక్సెస్ ఫుల్ నటుడిగా ఎదిగితే కొంతమంది ప్రశంసించగా మరి కొందరు బహిరంగంగా విమర్శలు చేశారని శివ కార్తికేయన్ చెప్పుకొచ్చారు.
శివ కార్తికేయన్ సక్సెస్ వెనుక ఆయన భార్య ప్రోత్సాహం కూడా ఉండటాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.ఎన్నో సవాళ్లు ఎదురైనా అంచెలంచెలుగా ఎదిగిన ఆయనను ప్రశంసిస్తున్నారు.శివ కార్తికేయన్ రెమ్యునరేషన్ సైతం గత కొన్నేళ్లలో భారీ స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది.
శివ కార్తికేయన్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాన్ని అందుకోనున్నారో చూడాల్సి ఉంది.తెలుగులో కూడా సినిమా సినిమాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడంలో ఈ హీరో సక్సెస్ అవుతున్నారు.