ఆ విషయంలో నేను నిరాశకు గురయ్యాను.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ( SS Rajamouli )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో( Mahesh Babu ) తెరకెక్కించబోయే సినిమా పనుల్లో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Ss Rajamouli Unveils India First Dolby Certified Postproduction Facility For Cin-TeluguStop.com

పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల చేయాలి అని భావిస్తున్నారు.ఈ సినిమా ఇంకా మొదలు కాకముందే ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది.సంగతి పక్కన పెడితే.

అన్నపూర్ణ స్టూడియోస్‌ ( Annapurna Studios )సరికొత్త చరిత్ర సృష్టించింది.ఇండియాలోనే మొట్టమొదటిసారి ఇక్కడ డాల్బీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.

Telugu Boldy Certified, Rajamouli, Ssrajamouli, Tollywood-Movie

డాల్బీ సర్టిఫికేట్‌ ( Dolby Certified )తో కూడిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ సౌకర్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.ప్రముఖ దర్శకుడు రాజమౌలి గురువారం దీనిని ప్రారంభించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ.ఆర్‌ఆర్‌ఆర్‌ రోజులు గుర్తుచేసుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను డాల్బీ విజన్‌ లో ప్రేక్షకులకు అందించాలని భావించినప్పుడు ఆ టెక్నాలజీ మన దేశంలో అందుబాటులో లేదు.దాంతో ఆ వర్క్స్‌ పూర్తి చేయడం కోసం మేము జర్మనీ వెళ్లాల్సి వచ్చింది.

స్వదేశంలోనే డాల్బీ విజన్‌ లో నా సినిమాను అనుభూతి చెందలేకపోయినందుకు కొంచెం నిరాశకు గురయ్యాను.కానీ, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్‌ లో దీనిని ఏర్పాటుచేయడం ఎంతో సంతోషంగా ఉంది.

Telugu Boldy Certified, Rajamouli, Ssrajamouli, Tollywood-Movie

నా తదుపరి సినిమా రిలీజ్‌ కు వచ్చే సమయానికి దేశంలో చాలాచోట్ల డాల్బీ విజన్‌ అందుబాటులోకి రానుంది.డాల్బీ విజన్‌ లో సినిమా చూడటం ఓకే విభిన్నమైన అనుభూతిని అందిస్తుంది.విజువల్స్‌లో వచ్చే క్లారిటీ కథను మరో స్థాయికి తీసుకువెళ్తుంది.ప్రేక్షకులందరూ దీనిని అనుభూతి చెందాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ రాజమౌళి.ఈ సందర్భంగా జక్కన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే రాజమౌళి గత సినిమా ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారు డైరెక్టర్ రాజమౌళి.తన తదుపరి సినిమాతో ఆ అంచనాలను మరింత పెంచేలా ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube