తెలుగు రాష్ట్రాల ప్రజలకు జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ( Jabardast comedian Panch Prasad )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా కమెడియన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రసాద్.
ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి మనందరికీ తెలిసిందే.గత కొన్నేళ్లుగా అయినా కిడ్నీ సమస్యతో ( kidney problem )బాధపడుతున్నారు.
అయితే రెండో కిడ్నీలు పాడవడంతో నెల రోజులపాటు డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఏమాత్రం ఆరోగ్యం మెరుగుపడలేదు.ఆ తర్వాత డాక్టర్లు వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించుకోవాలని లేదంటే వైద్యులు హెచ్చరించడంతో అలాంటి సమయంలో ప్రసాద్ భార్య సునీత నేనున్నానంటూ ముందుకు వచ్చి,తన కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమైంది.
అయితే డాక్టర్లు అందుకు ఒప్పుకోలేదు.వేరే కిడ్నీదాతను వెతుక్కోమని చెప్పారు.అవసరమైతే భవిష్యత్తులో మళ్లీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రసాద్ భార్య కిడ్నీ ఉపయోగిద్దామని అన్నారు.ఎంతో ఎదురు చూపులు, వెతుకులాట తర్వాత అతడికి కిడ్నీ దాత దొరికారు.
ఆపరేషన్ కు లక్షల్లో ఖర్చవుతుందని అన్నారు.అతడి విషయాన్ని అప్పటి మంత్రి ఆర్‌కే రోజా ఆనాటి సీఎం వైస్ జగన్‌మోహన్ రెడ్డి( CM Vice Jagan Mohan Reddy ) దృష్టికి తీసుకెళ్లారు.
ఆయన ఆదేశాలతో చికిత్సకు కావాల్సిన డబ్బు సీఎం సహాయకనిధి ద్వారా మంజూరు చేశారు.అలా 2023లో అతడికి విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన విషయం తెలిసిందే.
ఇక అప్పటినుంచి ఆరోగ్యంగా ఉన్న పంచ ప్రసాద్ ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితి గురించి తన యూట్యూబ్ ఛానల్( YouTube channel ) ద్వారా అభిమానులతో పంచుకుంటూ నే ఉన్నారు.ఇకపోతే తాజాగా పంచ్ ప్రసాద్ తన భార్య సునీతతో కలిసి ఒక టీవీ షో కి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏ భర్తా చేయని పని తాను చేశాడు.సునీత గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు.ప్రసాద్ మాట్లాడుతూ.ప్రేమించుకున్న వాళ్లు కలిసి బతకడానికి పెళ్లి చేసుకుంటారు.
కానీ నన్ను బతికించడం కోసమే ఆమె నన్ను పెళ్లి చేసుకుంది.నువ్వు చేసిన పనికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు.
మామూలుగా తల్లిదండ్రుల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటారు కదా నేనూ అదే చేయాలనుకుంటున్నా అన్నాడు.అనడమే ఆలస్యం భార్యను కూర్చోబెట్టి తాంబూలంలో ఆమె కాళ్లు కడిగి ఆ నీళ్లను తన నెత్తిన చల్లుకున్నాడు.
అది చూసి సునీత సైతం కన్నీళ్లు పెట్టుకుంది.నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆస్పత్రికి వెళ్లాలి.
కానీ తన గురించి వదిలేసి నా చుట్టూ తిరిగింది అంటూ ప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యాడు ప్రసాద్.దీంతో అక్కడున్న వారందరూ కూడా ఎమోషనల్ అయ్యారు.
అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.