వైరల్: పీలింగ్స్ పాటకి సెప్పులేసిన ముసలి బామ్మ... రష్మికను మ్యాచ్ చేసిందని కామెంట్స్!

ఐకాన్ బాబు అల్లు అర్జున్( Allu Arjun ) గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.ఇక ఆయన నటించిన పుష్ప 2 సినిమా( Pushpa 2 ) ఇటీవలే విడుదల అయ్యి, ఎంత పెద్ద హిట్ అయిందో కూడా మనందరికీ తెలిసిందే.

 Old Woman Amazing Dance For Pushpa 2 Peelings Song Video Viral Details, Peelings-TeluguStop.com

అన్నింటికీ మించి ఆ సినిమా ప్రివ్యూ షోస్ నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర నెలకొన్న వివాదం కూడా బాగా తెలుసు.ఇక ఆ సంగతి పక్కనబెడితే… ఈ సినిమా ప్రస్తుతం బాహుబలిని రికార్డును కూడా బ్రేక్ చేసి విజయపధంలో దూసుకెళ్తుంది.

ఇక, ఈ సినిమాకి దేవిశ్రీ ఇచ్చిన పాటలు సినిమాకే హైలెట్ గా నిలిచాయని చెప్పుకోవచ్చు.ముఖ్యంగా, పీలింగ్స్ పాటకి( Peelings Song ) స్పెషల్ క్రేజ్ రావడంతో ఆ సాంగ్ కు ఇప్పటికే ఎంతోమంది రీల్స్ చేయడం జరిగింది.

ఈ క్రమంలోనే కొన్ని రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ప్రస్తుతం ఓ రీల్ మాత్రం అన్నింటినీ మించిపోయి సోషల్ మీడియాలో దూసుకెళుతోంది.అవును, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో ఈ పాట సూపర్ హిట్ గా దూసుకుపోతోంది.ఈ పాటని చాలామంది రీల్స్ చేయగా లేటెస్ట్ గా ఒక ముసలి బామ్మ( Old Woman ) రీల్ చేయడంతో సదరు రీల్ చూసి జనాలు అవాక్కవుతున్నారు.ఎందుకంటే ఇక్కడ ఆమెకి సరిగా పళ్ల వరుస కూడా సరిగా లేదు.కానీ, స్టెప్పులు మాత్రం దుమ్ములేపింది.” పీలింగ్స్ ” పాటలో హీరోయిన్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) ఎలా అయితే మాస్ స్టెప్పులు వేసిందో ఆమెను మ్యాచ్ చేస్తూ ఈ బామ్మ ఇరగదీసింది.ప్రస్తుతం, ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంటే, అది చూసిన నెటిజన్లు సూపరో సూపర్ అంటూ బామ్మ గారిని ఆకాశానికెత్తేస్తున్నారు.

దాంతో ఈ రీల్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.ఈ క్రమంలో లక్షల్లో లైక్స్ సంపాదించుకుంది.ఇక వ్యూస్ కైతే లెక్కేలేదు.

మిలియన్ల వ్యూస్ తో ముందుకు పోతోంది.కాగా ఈ విడియోపైన జనాలు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

ఈ పాట ముందు, ఆ బామ్మ డాన్స్ ముందు రష్మిక దిగదుడుపు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ వయసులోనే ఇలా చేస్తున్నారంటే .యంగేజ్ లో ఏ రేంజ్ డ్యాన్స్ కుమ్మేసి ఉంటారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాలో శ్రీలీల ఐటెం సాంగ్ చేసినప్పటికీ రష్మిక పీలింగ్స్ పాట మాత్రమే క్లిక్ అయ్యింది.

దేవి శ్రీ ప్రసాద్ మార్క్ మ్యూజిక్ తో పాటను అదరగొట్టాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube