ఆస్తమా వ్యాధిని ప్రేరేపించే ఆహారాలివే.. ఉపశమనానికి ఏం చేయాలంటే..

ఉబ్బసం ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి.అందుకే వైద్యులు ఆస్తమా రోగులు ఎల్లప్పుడూ ఇన్‌హేలర్‌ను తీసుకెళ్లాలని సలహా ఇస్తుంటారు.

 Which Foods Trigger Asthma Disease , Asthma Disease, Trigger-TeluguStop.com

ఎందుకంటే ఆస్తమా ఎప్పుడైనా దాడి చేయవచ్చు.అటువంటి పరిస్థితిలో ఏ ఆహారం, పానీయాలు ఉబ్బసంలో ఉపశమనం కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉబ్బసం సమస్య తలెత్తినపుడు ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది.మీరు ఉబ్బసం వ్యాధి గ్రస్తులైతే రక్తంలో ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచడంలో సహాయపడే దానిమ్మ, బీట్‌రూట్ వంటి వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి.ఆస్తమా రోగులో ముఖ్యంగా పిల్లలు విటమిన్ డి తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.6 నుండి 15 సంవత్సరాల పిల్లలలో విటమిన్ డి లోపం మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది.సూర్యకాంతి విటమిన్ డి పోషకానికి ఉత్తమ మూలం.ఇంతే కాకుండా విటమిన్ డి అనేది గుడ్లు సాల్మన్ చేపలు, సోయా పాలు, నారింజ రసం నుండి కూడా విటమిన్ డి లభిస్తుంది.విటమిన్ ఎ ఆస్తమా దాడుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.విటమిన్ ఏ కారణంగా ఊపిరి తిత్తులు సక్రమంగా పనిచేస్తాయి.

క్యారెట్లు, చిలగడ దుంపలు, ఆకుకూరలలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది.మెగ్నీషియం ఊపిరి తిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

డార్క్ చాక్లెట్, గుమ్మడి గింజలు, పాలకూర , సాల్మన్ ఫిష్ వంటి వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.యాపిల్ తినడం వల్ల కూడా ఆస్తమా అటాక్ రిస్క్ తగ్గుతుంది.

దీనితో పాటు పిల్లలలో ఆస్తమా సమస్యను తగ్గించడంలో అరటిపండు సహాయ పడుతుంది.అరటిపండులో పొటాషియం ఉంటుంది.

ఇది ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరుస్తుంది.ఆస్తమా బాధితులు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండవచ్చు.

జంక్ ఫుడ్ పిల్లలలో తీవ్రమైన ఉబ్బసం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.ఆస్తమా రోగులు బీన్స్, క్యాబేజీ, వెల్లుల్లి, ఉల్లిపాయలు, వేయించిన ఆహారం, సోడా, శీతల పానీయాలు వంటి అధిక గ్యాస్ ఉత్పత్తి చేసే వాటికి దూరంగా ఉండాలి.

కడుపులో ఎక్కువ గ్యాస్ ఏర్పడినప్పుడు, డయాఫ్రాగమ్‌పై ఒత్తిడి ఉంటుంది.అధిక ఆమ్లత్వం ఛాతీ నొప్పిని పెంచుతుంది.

దీంతో ఆస్తమా సమస్యలు తలెత్తుతాయి.జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో తీవ్రమైన ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది.

సల్ఫైట్‌లను కలిగి ఉన్న వాటిని వాటికి దూరంగా ఉంచాలి.ఇవి ఆస్తమాను ప్రేరేపిస్తాయి.

వైన్, ఊరగాయలు, బాటిల్ నిమ్మరసం, మరాస్చిమో చెర్రీలు మొదలైనవి వీటికి ఉదాహరణలు.కృత్రిమ స్వీటెనర్లు, ప్రిజర్వేటివ్‌లు ఆస్తమాను ప్రేరేపిస్తాయి.

ఈ రసాయనాలు ఊపిరితిత్తులకే కాదు మొత్తం శరీరానికే హానికరంగా పరిణమిస్తాయ.

Which Foods Trigger Asthma Disease

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube