సోషల్ మీడియాలో కొన్ని రకాల వీడియోలు జనాలకు మంచి ఫన్ అందిస్తూ ఉంటాయి.ఈ క్రమంలోనే ఒక వీడియో చూసి జనాలు నవ్వుకోవడమే కాకుండా ఆశ్చర్యపోతున్నారు.
సాధారణంగా కొందరు వాహనాలను చిత్ర విచిత్రమైన పనులకు వాడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే కొందరు బైకులను బావుల వద్ద నీళ్ల మోటార్ల మాదిరి వాడగా, మరి కొందరు అదే బైకులతో వ్యవసాయ పొలంలో మట్టిని దున్నడం, చదును చేయడం చేస్తుంటారు.
మరికొంతమంది బైక్స్ ని విత్తనాలు జల్లడంలో వాడగా, మరికొందరు బైక్ సాయంతో వడ్లు జల్లుతూ ఉంటారు.ఎందుకంటే దేనికైనా సృజనాత్మకత జోడించడంలో మనిషి తరువాతే ఎవరైనా.
ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనునిత్యం వైరల్ అవుతుంటాయి.తాజాగా, పాకిస్థాన్‌కు ( Pakistan )చెందిన కొందరు యువకులు బైకును వాడిన విధానానికి సంబందించిన వీడియో కూడా ఈ రకంగానే వైరల్ కావడం కొసమెరుపు.విడియోలోకి వెళితే.వ్యవసాయ పొలంలో గడ్డిని కత్తిరించే యంత్రంలో( lawnmower ) డీజిల్ అయిపోగా వీడియోలో కనబడుతున్న కుర్రాళ్ళు యంత్రాన్ని నడిపించేందుకు విచిత్ర పద్ధతిని ఎంచుకున్నారు.
ఈ క్రమంలో తమ బైకును గోడ పైకి ఎత్తి పట్టుకుని, దాని వెనుక చక్రాన్ని యంత్రానికి తగిలించారు.తరువాత బైకు కింద పడకుండా మధ్యలో పెద్ద కర్రను పెట్టి, దాన్ని ఇద్దరు రెండు వైపులా పట్టుకుని నిలబడ్డారు.
బైకుపై ఓ వ్యక్తి కూర్చుని రైజ్ చేయగా.వెనుక టైరు సాయంతో యంత్రం గిరగిరా తిరుగుతూ గడ్డిని కత్తిరిస్తోంది.
కాగా ఇలా గడ్డి కోయడానికి విచిత్రంగా బండిని వాడిన వారి తెలివిని చూసి అంతా అవాక్కవుతున్నారు.ఈ నేపథ్యంలో “ఇది తెలివా.లేక అతి తెలివా?” అని కొందరు కామెంట్స్ చేస్తే, “బైకుతో ఇంజిన్‌ను నడిపించడం చాలా కొత్తగా ఉంది.కానీ చెత్తగా ఉంది” అని మరికొందరు కామెంట్ చేస్తే, “దీనికంటే డీజిల్ పోసి ఇంజిన్‌ను వాడడమే ఎంతో బెటర్” అని ఇంకొందరు కామెంట్స్ చేయడం ఇక్కడ మనం గమనించవచ్చు.
ఒక నెటిజన్ అయితే “వీళ్ల ప్రయోగం చూసి ప్రపంచమే విస్తుపోయేలా ఉందే” అంటూ సరదాగా కామెంట్ చేయడం ఇక్కడ చూడవచ్చు.మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఈ వీడియో ఇప్పటి వరకు 8వేలకు పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.