మానవ శరీరంలో హిమోగ్లోబిన్( Hemoglobin ) స్థాయి నిలకడగా ఉంటే ఆరోగ్యం బాగా ఉంటుంది కానీ, ఆ స్థాయి ఏమాత్రం అటుఇటు అయినా ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూ వుంటారు.అయితే అలా హిమోగ్లోబిన్ స్థాయి ఆరోగ్యకరంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకొని తీరాలి.
ముఖ్యంగా ఆకు కూరలు తరచుగా రక్తహీనతను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి.వీటి సహాయంతో, హిమోగ్లోబిన్ లోపం కూడా చాలా ఈజీగా తొలగించబడుతుంది.

బచ్చలికూర, మెంతికూర, తోటకూర( Spinach, fenugreek, asparagus ), పొన్నగంటి ఆకు, బ్రకోలీ వంటి కూరలను నిరంతరం తినడం ద్వారా, హిమోగ్లోబిన్ లోపం సమస్య అనేది త్వరగా తగ్గుతుంది.అదేవిధంగా బ్రౌన్ రైస్ లో గణనీయమైన మొత్తంలో ఇనుము ఎక్కువ కనిపిస్తుంది.ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ను చాలా వేగంగా పెంచుతుంది.హిమోగ్లోబిన్ లోపం ఉన్నప్పుడు బ్రౌన్ షుగర్ ఖచ్చితంగా వాడాలని వైద్యులు కూడా చెబుతున్నారు.చాలా కాలంగా కూడా హిమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్న వారు గుమ్మడి గింజలను తప్పనిసరిగా తింటే మంచి ఫలితం ఉంటుంది.

అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా హిమోగ్లోబిన్ లోపం ఉన్నవారికి సహాయపడతాయి.ఎండుద్రాక్ష, బాదం( Raisins, almonds ) వంటి డ్రై ఫ్రూట్స్ రక్తహీనతను త్వరగా తగ్గించడంలో సహాయపడతాయి.అలాగే చిరుధాన్యాలలో ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది కనుక అవి తీసుకోవడం తప్పనిసరి.
రాగులను ప్రతి రోజూ ఉపయోగించడం వల్ల హిమోగ్లోబిన్ సమస్య నుంచి చాలా త్వరగా మనకు ఉపశమనం లభిస్తుంది.అదేవిధంగా రోజూ ఆహారంలో వేరుశెనగలను చేర్చుకోండి.ఎందుకంటే దీని వల్ల శరీరంలో ఐరన్‌తో పాటు పోషకాల లోపం కూడా తీరుతుంది.అలాగే నానబెట్టిన బాదంపప్పును ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి ఖచ్చితంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.