విదేశీయులను లేదా విదేశీ పర్యాటకులను( Foreign tourists ) కొంతమంది స్థానికులు వేధించడం కామనే.కానీ పబ్లిక్ లో అందరి ముందే ఒక మహిళపై నేరుగా అసభ్యకరమైన మాటలు మాట్లాడటం మాత్రం చాలా అరుదు.
అది సహించరానిది కూడా.పైగా ఇది చాలా పెద్ద నేరం.
అయితే దురదృష్టవశాత్తు ఒక రష్యన్ మహిళకు ( Russian woman )మన ఇండియాలోనే అలాంటి చేదు అనుభవం ఎదురయింది.వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ యూట్యూబర్ మిథిలేష్ బ్యాక్‌ప్యాకర్ ( Mithilesh backpacker )తన భార్య లిసాతో ( Lisa )కలిసి ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్‌కు వెళ్లాడు.
అక్కడ హాయిగా టైమ్ గడుపుదామని అనుకున్నారు కానీ ఊహించని షాక్ తగిలింది.వీరిద్దరూ కలిసి వీడియో చేస్తుండగా, పక్కనే ఉన్న ఓ వ్యక్తి అసభ్యకరంగా “6,000 INR” అంటూ వ్యాఖ్యానించాడు.
ఇది తరచుగా లైంగికపరమైన అర్థాలు వచ్చేలా వాడే ఒక చౌకబారు జోక్ అన్నమాట.దీంతో ఒక్కసారిగా ఆగ్రహించిన మిథిలేష్ అతన్ని నిలదీశాడు.పోలీసులకు ఫోన్ చేస్తానని హెచ్చరించాడు.కానీ ఆ వ్యక్తి మాత్రం తాను అలాంటిదేమీ అనలేదని బుకాయించాడు.దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.అంతేకాదు, ఆ రోజంతా తమను కొందరు వ్యక్తులు వెంబడిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని మిథిలేష్ ఆరోపించడం మరింత ఆగ్రహాన్ని తెప్పించింది.
ఈ విషయాన్ని ప్యాలెస్ సెక్యూరిటీ ( Palace Security )దృష్టికి తీసుకెళ్లగా, వారు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని చెప్పడం షాకింగ్‌కు గురిచేసింది.
“నా భార్య నా పక్కనుండగా ఇలాంటి నీచమైన పనులు ఎలా చేస్తారు? ఇది నిజంగా షాకింగ్, భారతీయుడిగా నిన్ను సిగ్గుపడుతున్నా.” అంటూ మిథిలేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇలాంటి సంఘటనలు భారతదేశ పర్యాటక రంగానికి, దేశ ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దురదృష్టవశాత్తు ఇది ఒక్కటే కాదు, గతంలోనూ చాలా మంది విదేశీ పర్యాటకులు భారతదేశంలో వేధింపులకు గురయ్యారు.2018లో ఓ బెల్జియం టూరిస్ట్ ఢిల్లీలో వేధింపులకు గురై 24 గంటల్లోనే దేశం విడిచి వెళ్లిపోయారు.మరో ఘటనలో జైపూర్‌లో ఓ విదేశీ మహిళను ఆటో డ్రైవర్ అసభ్యంగా తాకడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.