విమానానికి ఎదురుగా దూసుకొచ్చిన క్షిపణి.... క్షణాల్లోనే అంతా జరిగిపోయింది.!

ఆకాశంలో విహరించే విమానానికి ఒక క్షిపణి ఎదురుగా వస్తే… ఆ విమానంలోని ప్రయాణికులు ప్రాణ భయంతోనే గజగజ వణికి పోవటం ఖాయం.తాజాగా ఇలాంటి పరిస్థితి కొందరి ప్రయాణికులకు నిజంగానే ఎదురయింది.

 The Missile That Crashed In Front Of The Plane Everything Happened In Moments F-TeluguStop.com

ఈ ఘటనలో ఆకాశంలో ప్రయాణించే విమానానికి ఒక క్షిపణి అడ్డుగా వచ్చింది.వెంటనే దాన్ని గమనించిన పైలెట్స్ అప్రమత్తం అయ్యి విమానాన్ని దారి మళ్ళించారు.

వివరాల్లోకి వెళితే… చైనాకు చెందిన ఓ బోయింగ్ విమానం దక్షిణ చైనా సముద్రం మీదుగా ప్రయాణిస్తోంది.సరిగ్గా అప్పుడే సముద్ర ఉపరితలం నుంచి చైనాకు సంబందించిన ఒక క్షిపణిని ప్రయోగించింది.

అయితే క్షిపణి రాకను గుర్తించిన ఏటీసీ వెంటనే విమాన పైలట్లను అప్రమత్తం చేసింది.వారి ఆదేశాలను అనుసరించి తక్షణమే విమానాన్ని 90 డిగ్రీలు ఎడమకు తిప్పి విమానాన్ని దారి మళ్లించారు.

లేదంటే విమానం క్షిపణిని ఢీకొట్టి భారీ ప్రమాదం జరిగేది.ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.

ఆ వీడియోను బోయింగ్ విమానం కాక్‌పిట్‌ నుంచి రికార్డ్‌ చేసినట్లుగా తెలుస్తుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోను అమెరికాకు చెందిన ఓ పైలట్‌ మే 25న ట్విటర్‌లో పోస్ట్‌ చేసినట్టు తెలుస్తుంది.

అయితే ఈ విమానం తమ సంస్థకు చెందినదికాదని కాథీ పసిఫిక్‌ చెప్పడం గమనార్హం.ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దక్షిణ చైనా సముద్రంలో క్షిపణి ప్రయోగాలు చేపడుతున్నట్లుగా చైనా దేశం విమానయాన సంస్థలకు గానీ లేదా ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు గాని ఎలాంటి ముందస్తు నోటీసులు జారిచేయలేదట.

అంటే చైనా అత్యంత రహస్యంగా ఈ ప్రయోగాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం గానీ ఆస్థి నష్టం గానీ జరగకుండా విమానంలోని ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారు.

కాగా ఈ విమానంలో ఎంత మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారనే విషయంపై స్పష్టత లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube