ఏపీలో వెలువడబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమా ఏంటి అనేది ఎవరికి అంతుపట్టడం లేదు.అసలు ఏ ధీమాతో ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారం చేపడతాము అని వైసిపి అగ్ర నేతలు ప్రకటనలు చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కావడం లేదు.
ఈ ఎన్నికల్లో గెలిచేది తామేనంటూ టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) కూటమితో పాటు, వైసిపి కూడా వ్యక్తం చేస్తూ ఉండడంతో, దీనిపై జనాల్లో కన్ఫ్యూజన్ నెలకొంది.ఇక పదేపదే వైసిపి గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూ ఉండడం టిడిపికి కూడా ఆందోళన పెంచుతోంది.
తాము గెలవబోతున్నాము అనే విషయాన్ని చెప్పడమే కాదు, జూన్ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము అంటూ తేదీ ముహూర్తాన్ని కూడా వైసిపి ప్రకటించడంతో .అసలు ఏ ధైర్యంతో వైసిపి ఈ విధంగా ప్రకటనలు చేస్తుందనేది టిడిపికి అర్థం కావడం లేదు.
దీంతో టీడీపీ నాన హైరానా పడుతోంది.ఇప్పటికే వైసీపీ ప్రమాణ స్వీకారం తేదీ ముహూర్తాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) ఇటీవలే ప్రకటించారు.దీంతో టిడిపి కూడా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా టిడిపి నేత గంటాశ్రీనివాసరావు ప్రకటించారు.అయితే గంటా వ్యాఖ్యలను టిడిపి నేతలు ఎవరు సమర్థించలేదు.జూన్ 9వ తేదీన వైసిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని ఫిక్స్ అయిపోయిన ఆ పార్టీ నేతలు, జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ హడావుడి మొదలుపెట్టారు.దీంతో టీడీపీ( TDP ) ఈ వ్యవహారాలపై లోలోపల టెన్షన్ పడుతోంది.
జూన్ 9వ తేదీ నాటికి ముందస్తుగా హోటల్ రూమ్ కూడా వైసిపి నేతలు బుక్ చేసుకుంటున్నారు.ఇప్పటికే కొన్నిచోట్ల హోటల్ రూమ్ లు బ్లాక్ చేసి పెట్టినట్లుగా తెలుస్తోంది .విఐపి లు, వివిఐపీల కోసం భారీగానే ఏర్పాట్లు స్థానిక నేతలు చేపడుతున్నారట.ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రమాణస్వీకారం వేదిక ను కూడా ఫిక్స్ చేయనున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.