టీడీపీ నేత బుద్ధా వెంకన్న( Buddha Venkanna ) కీలక వ్యాఖ్యలు చేశారు.నారా లోకేశ్( Nara Lokesh ) ను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు.
ఇది తన డిమాండ్ అన్న బుద్దా వెంకన్న తనకు డిమాండ్ చేసే హక్కు ఉందని పేర్కొన్నారు.చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే నారా లోకేశ్ ను అధ్యక్షుడిగా నియమించాలని తెలిపారు.
లోకేశ్ ను అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీ మరో 30 ఏళ్లు బతుకుతుందని వెల్లడించారు.ఈ క్రమంలోనే లోకేశ్ ను పార్టీ చీఫ్ గా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.