హైదరాబాద్ లోని సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు ( CCS ACP Umamaheswara Rao )కేసులో ఏసీబీ దర్యాప్తు శరవేగంగా కొనసాగుతోంది.ఈ మేరకు ఏసీపీ ఉమామహేశ్వర రావును ఏసీబీ కస్టడీకి కోరింది.
కాగా ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో విస్తృతంగా సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు( ACB officials ) ఉమా మహేశ్వరరావును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయనను వారం రోజుల పాటు కస్టడీ విచారణకు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఏసీబీ అధికారులు కోరారు.
ఉమామహేశ్వర రావును కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరి కొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.కాగా ఏసీపీ ఉమామహేశ్వర రావు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇటీవలే జూన్ 5వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.