మడతలు.( wrinkles )వయసు పైబడిన తర్వాత దాదాపు ప్రతి ఒక్కరు ఎదుర్కొనే చర్మ సమస్యల్లో ఇది ఒకటి.
అయితే ఇటీవల రోజుల్లో చాలా మంది 30 ఏళ్లకే ముడతల సమస్యతో బాధపడుతున్నారు.మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం.
ఇందుకు ప్రధాన కారణం.ఏదేమైనా ముడతలు ముసలితనానికి సంకేతం.
అందుకే ముఖం పై ముడతలు కనిపించగానే తెగ హైరానా పడిపోతుంటారు.కానీ వర్రీ వద్దు.
అందరి వంటింట్లో ఉండే మెంతులతో ముడతలకు ఈజీగా చెక్ పెట్టవచ్చు.

వయసును దాచేసే సామర్థ్యం మెంతులకు ఉంది.మరి ఇంతకీ మెంతులను చర్మానికి ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ), ఒక చిన్న కప్పు పాలు( Milk ) వేసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక చిన్న టమాటో( Tomato ) ని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక నిమ్మ పండును కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకొన్న టమాటో ముక్కలు, నిమ్మ పండు ముక్కలు ( Lemon slices )వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మరోసారి మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మెంతులను ( Fenugreek )వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పేస్ట్ లో ముందుగా తయారుచేసి పెట్టుకున్న టమాటో లెమన్ జ్యూస్( Lemon juice ) తో పాటు వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలిఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే ముడతలు దెబ్బకు మాయం అవుతాయి.అలాగే సాగిన చర్మం టైట్ గా మారుతుంది.వయసు పైబడిన సరే స్కిన్ యవ్వనంగా కాంతివంతంగా మెరిసిపోతుంది.పైగా ఈ రెమెడీ వల్ల మొటిమలు రావడం తగ్గుతాయి.
వాటి తాలూకు మచ్చలు ఏమైనా ఉన్నా సరే మాయమవుతాయి.