వీడియో వైరల్: వధూవరులు ఇద్దరు మంటల్లో కాలిపోతే ఎవరు బాధ్యులు..?

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో జరిగే పెళ్లి వేడుకను( Wedding ceremony ) చాలా ఘనంగా జరుపుకోవాలని తమ తొహతకు కంటే ఎక్కువ ఖర్చు చేసేస్తున్నారు.ఇందుకోసం పెళ్లి కార్డు మొదలుకొని తిరిగి వెళ్లే సమయంలో బంధుమిత్రులకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ వరకు అన్ని ప్రత్యేకంగా ఉండాలని రకరకాల ఆలోచనలు చేస్తూ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు.

 Who Is Responsible If The Video Goes Viral And The Bride And Groom Burn In The F-TeluguStop.com

ఇక ఈ కార్యక్రమాలకు సంబంధించిన అనేక వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.ముఖ్యంగా వధూవరులు ఇద్దరు డాన్స్ చేస్తున్న వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ కావడం ఈమధ్య ఎక్కువైపోయింది.

ఇది ఇలా ఉండగా తాజాగా వధూవరులు ఇద్దరు కళ్యాణమండపంలోకి ఎంట్రీ ఇచ్చిన సీన్ చూసి నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఇక ఈ వైరల్ వీడియోలో ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న వినూత్న ఘటన చూసి పెళ్లికి వచ్చిన అతిధులందరూ ముక్కున వేలు వేసుకున్నారు.ఈ మధ్యకాలంలో చాలామంది వధూవరుల ఎంట్రీ సీన్ కాస్త వెరైటీగా ఉండాలంటూ కొత్త కొత్తగా ప్లాన్ చేస్తున్నారు.ఈ నేపథ్యం లోనే తాజాగా ఓ వివాహ కార్యక్రమంలో ఎవరు ఊహించని విధంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు వధూవరులు.అసలు విషయంలోకి వెళ్తే పెళ్లి చేసుకోబోతున్న వధూవరులు ఇద్దరికీ వెనుక భాగాన నిప్పు అంటించారు.

అలా నిప్పు అంటుకున్న తర్వాత వారు పెళ్లి మండపంలోకి ఎంట్రీ అవుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

అయితే ఈ సమయంలో వధూవరులకు ఏమవుతుందో అని అక్కడికి వచ్చిన అతిథులందరూ కాస్త టెన్షన్ గానే ఉన్నారు.అయితే వధూవరులు మంటలలో వస్తున్న సమయంలో ఏదైనా పొరపాటు జరగకుండా వెనకాల ఒక వ్యక్తి మంటలు ఆర్పేందుకు సిలిండర్ ( cylinder )ఏర్పాటు చేసుకుని రెడీగా ఉన్నాడు.ఈ వెరైటీ వీడియోని చూసిన చాలామంది నెటిజెన్లు భిన్నాభిప్రాయాలు తెలుపుతున్నారు.

అందులో కొందరైతే ఇలాంటివి చేయడం వల్ల ప్రాణహాన్ని కలుగుతుందని కొందరు అంటుండగా.పిచ్చి పరాకాష్ట చేరినట్టు మరో కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube