అల్లరి మూకల దాడితో కిర్గిస్థాన్‌లోని ( Kyrgyzstan ) భారతీయ విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.అటు తమ పిల్లల క్షేమ సమాచారం కోసం భారత్‌లోని వారి తల్లిదండ్రులు టెక్షన్ పడుతున్నారు.
కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో( Bishkek ) పరిస్ధితి అదుపులోనే ఉందని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం ప్రకటించినా, విద్యార్ధుల వెర్షన్ మరోలా ఉంది.హాస్టల్ దాటి బయటకు వెళ్లలేకపోతున్నామని.
ఆకలితో ఆలమటించి పోతున్నామని వారు చెబుతున్నారు.
బిష్కెక్‌లోని 10 వైద్య కళశాలలు తొమ్మిదో సెమిస్టర్ వరకు ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించాయి.
భద్రతకు భరోసా( Safety Assurance ) ఇస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్ధులు కిర్గిస్థాన్ రాజధాని నుంచి స్వదేశానికి చేరుకుంటున్నారు.ఇప్పటికే 150 మందితో కూడిన విమానం ఢిల్లీలో( Delhi ) ల్యాండ్ కాగా.ఇవాళ మరో ఫ్లైట్ రానుంది.ఓ జాతీయ వార్తాసంస్థతో విద్యార్ధులు మాట్లాడుతూ.
గడిచిన రెండు రోజులుగా పరిస్ధితులు మెరుగుపడ్డాయని, కానీ సాధారణ పరిస్ధితి నెలకొనేవరకు తిరిగి కిర్గిస్థాన్ వెళ్లబోమని తెలిపారు.
తరగతులు ఆన్‌లైన్ మోడ్‌కు మారిన వెంటనే.మా కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల సంగతి తెలిసిందని విద్యార్ధులు చెప్పారు.తాము చదువుకుంటున్న యూనివర్సిటీలు తక్కువ ఛార్జీతో ఎయిర్‌పోర్టు వరకు మాత్రమే రవాణా సదుపాయం ఏర్పాటు చేశాయని వారు పేర్కొన్నారు.అలంటీ నుంచి ఇండియాకు( India ) ఫ్లైట్ టికెట్ సాధారణ రోజుల్లో రూ.10 వేలు ఉంటుందని, కానీ ఈ విమానాల్లో రూ.28 వేలు వసూలు చేశారని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు.అల్లర్ల సమయంలో ఆడియో, వీడియో ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని వర్సిటీ తమకు అడ్వైజరీలు జారీ చేశాయని పేర్కొన్నారు.ఈ ఒప్పందాలపై తాము సంతకం చేశామని చెప్పారు.
స్థానిక రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నుంచి తమకు ఎలాంటి సహాయం లభించడం లేదని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.వారి స్వస్థలాల్లోని ఎమ్మెల్యే, ఎంపీలు, ఇండియన్ ఫారిన్ మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ వంటి సంఘాల ద్వారా విద్యార్ధులు స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తున్నారు.