ఎన్టీఆర్, చరణ్ లతో నటించాలని ఉంది.. ఆస్కార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై రెండు సంవత్సరాలు అవుతోంది.ఈ సినిమా ఇప్పటికీ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తోంది.

 Oscar Heroine Comments Goes Viral About Ntr Charan Details Here , Oscar Heroine-TeluguStop.com

ఎంతోమంది హాలీవుడ్ నటులు ఈ సినిమాను చూసి తారక్, చరణ్ యాక్టింగ్ తో పాటు రాజమౌళి డైరెక్షన్ స్కిల్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ఆర్ఆర్ఆర్ సీక్వెల్(Sequel to RRR) కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా జక్కన్(Jakkan) న ఒక్కో సినిమాకు ఐదేళ్ల సమయం కేటాయిస్తున్న నేపథ్యంలో ఈ కాంబో సాధ్యమయ్యే అవకాశం అయితే కనిపించడం లేదని తెలుస్తోంది.

Telugu Anne Hathaway, Charan, Jakkan, Oscar, Rajamouli, Sequel Rrr-Movie

అయితే ఆస్కార్ హీరోయిన్ అన్నే హతవే ఆర్ఆర్ఆర్(Anne Hathaway RRR) సినిమా గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇంటర్ స్టెల్లార్ సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న అన్నే హతవే(Anne Hathaway) ఆర్ఆర్ఆర్ మూవీ తనకు ఎంతగానో నచ్చిందని చెప్పుకొచ్చారు.ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలతో, ఈ సినిమా టీంతో కలిసి నటించడానికి తాను సిద్ధమేనని హతవే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telugu Anne Hathaway, Charan, Jakkan, Oscar, Rajamouli, Sequel Rrr-Movie

ఆర్ఆర్ఆర్ నటులకు ప్రముఖ నటి నుంచి ఈ స్థాయిలో ప్రశంసలు దక్కడం అంటే ఎన్టీఆర్, చరణ్ యాక్టింగ్ తో ఏ స్థాయిలో మెప్పించారో సులువుగానే అర్థమవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.చరణ్, తారక్ లకు ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ రావడం ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

Telugu Anne Hathaway, Charan, Jakkan, Oscar, Rajamouli, Sequel Rrr-Movie

తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం.రాజమౌళి (Rajamouli) తర్వాత సినిమాలతో ఆర్ఆర్ఆర్ సినిమాను మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ భవిష్యత్తు సినిమాలు ఒకింత భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి.ఎన్టీఆర్ దేవర రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలతో భారీ విజయాలను అందుకుంటారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube