బెంగళూరు రేవ్ పార్టీ దర్యాప్తు ముమ్మరం.. నటి హేమకు నోటీసులు

బెంగళూరు రేవ్ పార్టీ( Bangalore rave party ) కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ పార్టీలో తెలుగు నటులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

 Bengaluru Rave Party Investigation In Progress Notices To Actress Hema , Bangalo-TeluguStop.com

నటి హేమతో పాటు ఆశీరాయ్ పార్టీకి హాజరయ్యారని పోలీసులు పేర్కొన్నారు.హేమ, ఆశీరాయ్ డ్రగ్స్ తీసుకున్నట్లు బ్లడ్ శాంపిల్స్ పరీక్షలో వెల్లడైంది.

దీంతో విచారణకు హాజరుకావాలని ఇద్దరికి పోలీసులు నోటీసులు అందించారు.కాగా పార్టీలో పాల్గొన్న 103 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించిన సంగతి తెలిసిందే.

వీరిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.అదేవిధంగా రేవ్ పార్టీ కేసులో ఏ1 గా వాసు, ఏ2గా అరుణ్ కుమార్, ఏ3 గా నాగబాబు, ఏ4గా రణధీర్ బాబు, ఏ5గా మహ్మద్ అబూబకర్, ఏ6 గా గోపాల్ రెడ్డి, ఏ7గా 68 మంది పురుషులు, ఏ8గా 30 మంది యువతులను పోలీసులు పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు సెక్స్ రాకెట్ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube