రాజకీయం అనేది బ్రతికున్నంత కాలం పవన్ పేరు వినిపిస్తుంది.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది( Hyper Aadi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్,శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి షోలు చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

 Hyper-aadi-speech-about Pawan Kalyan Success, Pawan Kalyan, Hyper Aadi, Comments-TeluguStop.com

ఇక అప్పుడప్పుడు రాజకీయాలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ లేని పోనీ కాంట్రవర్సీలు కొని తెచ్చుకుంటూ ఉంటాడు హైపర్ ఆది.కాగా హైపర్ ఆది పవన్ కళ్యాణ్ అభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే.పవన్ కళ్యాణ్ ని ఎవరైనా ఏమైనా అంటే వారి మీద విరుచుకుపడుతూ ఉంటారు హైపర్ ఆది.ఇటీవల కాలంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ తరపున మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.

Telugu Deputy Cm, Hyper Aadi, Jana Sena, Pawan Kalyan-Movie

తాజాగా కూడా మరోసారి వార్తల్లో నిలిచారు హైపర్ ఆది.తాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం( Deputy CM ) తాలుకా అని వ్యాఖ్యానించారు నటుడు హైపర్‌ ఆది.ఇదే మాట ఎంతకాలమైనా చెప్పుకుంటానన్నారు.ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని, ఏపీలో కూటమి విజయం సాధించిన సందర్భంగా పీపుల్‌ మీడియా ఫ్టాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ నిర్వహించిన విజయోత్సవ వేడుకలో హైపర్‌ ఆది పాల్గొన్నారు.

కూటమి అనే సినిమా 164 రోజులు ఆడింది.అందుకే ఈ సక్సెస్‌ మీట్‌ నిర్వహించుకుంటున్నాము ఏ కుమారుడు అయినా తన మొదటి సంపాదనతో తల్లికి చీర కొనిపెట్టినప్పుడు, బైక్‌పై తండ్రిని కూర్చోపెట్టుకున్నప్పుడు ఎంత ఆనందం వస్తుందో పవన్ కళ్యాణ్ గెలిచినపుడు ప్రతి జనసైనికుడి కళ్లలో ఆ ఆనందాన్ని చూశాను.

Telugu Deputy Cm, Hyper Aadi, Jana Sena, Pawan Kalyan-Movie

లంకా దహనం తర్వాత హనుమంతుడు వెళ్లి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్లు ఎన్నికల్లో విజయం తర్వాత తన విజయాన్ని అన్నయ్య చిరంజీవి కాళ్ల దగ్గర పెట్టాడు.అంతకంటే భావోద్వేగ సందర్భం మరొకటి ఉండదు అని చెప్పుకొచ్చారు హైపర్ ఆది.అనంతరం ఆది మాట్లాడుతూ.పలు వేదికల దగ్గర అభిమానులు సీఎం సీఎం అని అరుస్తుంటే.

మీ వాడిని ఫస్ట్‌ ఎమ్మెల్యే అవ్వమను అని కామెంట్‌ చేసేవారు.వాళ్లందరికీ ఇదే నా మాట.21 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తే.అన్ని చోట్ల గెలిచాడు.

పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాల్లో గెలిచి సత్తా చాటాడు.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చున్నాడు.

రాజకీయం అనేది బతికున్నంత కాలం పవన్ కల్యాణ్‌ పేరు వినబడుతూనే ఉంటుంది.పదో తరగతి పుస్తకాల్లో చరిత్రను చదువుకున్నట్లు.

దానికి ఏమాత్రం తీసిపోని చరిత్ర పవన్ కల్యాణ్‌( Pawan Kalyan )ది.సాధారణంగా గెలిచిన వాళ్లల్లో గర్వం ఉంటుంది.కానీ పవన్ కళ్లలో భయాన్ని చూశారు.ప్రజలు బలమైన బాధ్యను అప్పగించారు 100 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిపించినట్లే 100 శాతం సక్సెస్‌గా తన బాధ్యతను నిర్వర్తించాలనే భయం ఆయన కళ్లల్లో చూశాను.

ఆయన అది చేసి చూపిస్తారు అని చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube